ఇబ్రహీంపట్నం: దేశ రక్షణ, ప్రజల భద్రత కోసం విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల ధైర్యసాహసాలు, సేవలు స్ఫూర్తిదాయకమని ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్‌జోషి అన్నారు. పోలీస్ కమిషనరేట్‌లో బుధవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించి, ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోలీస్ పరేడ్ నిర్వహించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. అమరవీరుల కుటుంబ సభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈకార్యక్రమంలో జాయింట్ పోలీస్ కమిషనర్ చందనా దీప్తీ, షాద్‌నగర్, మహేశ్వరం డీసీపీలు సీహెచ్ శిరీష, కె.నారాయణరెడ్డి, ట్రాఫిక్ డీసీపీ శివయ్ ఉపాధ్యాయ, అడిషనల్ డీసీపీ జహంగీర్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ హుస్సైనినాయుడు, సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్ ఏసీపీ అరుణ్‌కుమార్, ఏసీపీలు ఎస్ లక్ష్మీనారాయణ, కేవీపీ రాజులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
మూడో బెటాలియన్ ఆధ్వర్యంలో..
ఇబ్రహీంపట్నం సమీపంలోని ఆక్టోపస్‌లోని టీజీఎస్పీ 3వ బెటాలియన్ ఆధ్వర్యంలో అమరులవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 3వ బెటాలియన్ కమాండెంట్ సయ్యద్ జమీల్ బాషా మాట్లాడుతూ.. పోలీసు అమరవీరుల త్యాగస్ఫూర్తిని మర్చిపోలేమన్నారు. అమరవీరుల ఆశయాలను ఆదర్శంగా తీసుకుని, అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. రెండు నిమిషాలు మౌనం పాటించి అమరవీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమాండెంట్ ఎస్.శ్రీనివాసరావు, అసిస్టెంట్ కమాండెంట్ శ్రీనివాస్‌రావుతోపాటు బెటాలియన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఫ్యూచర్ సిటీ కమిషనరేట్‌లో పరేడ్


