సీఎం పర్యటనను సక్సెస్‌ చేద్దాం | - | Sakshi
Sakshi News home page

సీఎం పర్యటనను సక్సెస్‌ చేద్దాం

Oct 22 2026 7:08 AM | Updated on Oct 22 2026 7:08 AM

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలి పటిష్ట బందోబస్తుకు చర్యలు ప్రతి అంశం సున్నితంగా పరిశీలించాలి ఇంటెలిజెన్స్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌, కలెక్టర్‌ దీపక్‌ తివారి

కొడంగల్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం కొడంగల్‌ పర్యటన సందర్భంగా బుధ వారం పట్టణంలోని కడా కార్యాలయంలో అడ్వాన్స్‌ సెక్యూరిటీ లైషన్‌ (ఏఎస్‌ఎల్‌) సమావేశం నిర్వహించారు. ఇంటెలిజెన్స్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌, కలెక్టర్‌ దీపక్‌ తివారి, ఎస్పీ స్నేహ మెహ్ర పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అధికారులందరూ సమన్వయంతో పని చేయాలన్నారు. పటిష్టమైన బందోబస్తు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. భద్రత ఏర్పాట్లు, ట్రాఫిక్‌ నియంత్రణ, వైద్యసేవలు, విద్యుత్‌ సరఫరా తదితరల అంశాలపై చర్చించారు. సీఎం పర్యటనకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులకు సూచనలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎత్తైన భవనాలపై పోలీసు పహారా ఏర్పాటు చేయాలన్నారు. అగ్నిమాపక వాహనాన్ని అందుబాటులో ఉంచాలన్నారు. రోడ్ల సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్టాస్టిక్‌ కవర్లు, ఇతర వ్యర్థాలను తొలగించి పరిసరాలను శుభ్రంగా ఉంచాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచాలన్నారు. కొడంగల్‌ ఆస్పత్రిలో ఎమర్జెన్సీ విభాగం వద్ద వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్‌ అంతరాయం లేకుండా చూడాలని, అత్యవసర పరిస్థితుల్లో వాడుకోడానికి జనరేటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆహార భద్రత అధికారులు ఆహార పదార్థాలను తనిఖీ చేసి నాణ్యతపై నిర్ధారణ చేసిన తర్వాతనే సంబంధిత వ్యక్తులకు అందించాలని స్పష్టం చేశారు. అటవీశాఖ అధికారులు క్రిమి కీటకల సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, అడిషనల్‌ ఎస్పీ రాజేష్‌ మీనా, డీఎస్పీ శ్రీనివాస్‌, మున్సిపల్‌ చైర్మన్‌ నందారం ప్రశాంత్‌, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement