శంకర్పల్లి: స్క్రాప్ దుకాణ యజమానిని ముగ్గురు దుండగులు కత్తితో బెదిరించి రూ.25వేలు అపహరించిన కేసులో పోలీసులు మరో నిందితుడిని మంగళవారం అరెస్టు చేశారు. సీఐ రుధ్వీర్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 8న వేకువజామున ముగ్గురు దుండగులు మున్సిపల్ పరిధిలోని ఫత్తేపూర్ వద్ద స్క్రాప్ దుకాణ యజమానిపై దాడి చేసి, కత్తితో బెదిరించి రూ.25వేలు, రెండు ఫోన్లు లాక్కెళ్లిన విషయం తెలిసిందే. ఈనెల 10న ప్రధాన నిందితుడు మహ్మద్ రబ్బానీ (30)ని పోలీసులు అరెస్టు చేయగా.. తాజాగా మరో నిందితుడు మహ్మద్ అజారుద్దీన్ (30)ని అరెస్టు చేశారు. నిందితుడిని చేవెళ్ల కోర్టులో ప్రవేశపెట్టి, రిమాండ్ నిమిత్తం సంగారెడ్డి జిల్లా జైలుకి తరలించారు.


