భారీ బందోబస్తు | - | Sakshi
Sakshi News home page

భారీ బందోబస్తు

Sep 21 2026 7:23 AM | Updated on Sep 21 2026 7:23 AM

భారీ బందోబస్తు

కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధుల క్షేత్ర పరిశీలన

పోలీసుల పటిష్ట పహారా

అజీజ్‌నగర్‌ ప్రాంతంలో హడావుడి

మొయినాబాద్‌: కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధుల బృందం బీఆర్‌ఎస్‌ నేతల క్షేత్ర స్థాయి పరిశీలన సందర్భంగా ఫ్యూచర్‌సిటీ సిటీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చేవెళ్ల డీసీపీ యోగేష్‌గౌతమ్‌ ఆధ్వర్యంలో సుమారు 200 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. అజీజ్‌నగర్‌ పరిసరాల్లో ఎటు చూసినా పోలీసులే కనిపించారు. హరీశ్‌రావు, రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌ల వైపు ఎవరూ వెళ్లకుండా అటువైపు వెళ్లే అన్ని దారుల్లో పహారా కాశారు. ఇతరులు ఎవరినీ అటువైపు వెళ్లకుండా అడ్డుకున్నారు.

నేరుగా హరీశ్‌రావు ఫాంహౌస్‌కు..

కాంగ్రెస్‌ ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, బలరాంనాయక్‌, రాజ్యసభ సభ్యుడు అనిల్‌ యాదవ్‌, ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్‌, రామ్మోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, నవీన్‌యాదవ్‌, బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్‌, బల్మూరి వెంకట్‌ తదితరులు ప్రత్యేక బస్సు, కార్లలో నగరం నుంచి నేరుగా హరీశ్‌రావు ఫాంహౌస్‌ వద్దకు చేరుకున్నారు. శ్రీనిధి స్కూల్‌ నుంచి రోడ్లు ఇరుగ్గా ఉండటంతో బస్సులు రావడానికి ఇబ్బంది కలిగింది. హరీశ్‌రావు ఫాంహౌస్‌ వద్ద నేతలంతా గంటపాటు మీడియాతో మాట్లాడారు. ఫాంహౌస్‌ 111 జీవో, ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉందని ఆరోపించారు. అనంతరం రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌ వద్దకు చేరుకుని.. ఫాంహౌస్‌ గేటు ఎదుట గంట పాటు మీడియాతో మాట్లాడారు. రోహిత్‌రెడ్డి అసైన్డ్‌ భూమిలో ఫాంహౌస్‌ నిర్మించి.. డ్రగ్స్‌ పార్టీలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. రెండు గంటల పాటు అజీజ్‌నగర్‌ ప్రాంతంలో పోలీసులు, కాంగ్రెస్‌ నేతల హడావుడి నెలకొంది. అజీజ్‌నగర్‌ పాతరోడ్డులో కొంత సేపు ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement