రాజకీయ శక్తిని నవీకరిస్తాం | - | Sakshi
Sakshi News home page

రాజకీయ శక్తిని నవీకరిస్తాం

Sep 21 2026 7:23 AM | Updated on Sep 21 2026 7:23 AM

షాద్‌నగర్‌: రాజకీయ శక్తిని నవీకరించే దిశగా తమ పార్టీ ముందుకు సాగుతుందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న అన్నారు. గోల్కొండ కోట నుంచి చేపట్టిన పాదయాత్ర ఆదివారం షాద్‌నగర్‌ పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా పట్టణ చౌరస్తాలో నిర్వహించిన రోడ్‌ షోలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాజ్యాధికారం కొద్దిమంది ఆధిపత్య వర్గాల చేతుల్లోనే కేంద్రీకృతం అయ్యిందని విమర్శించారు. బీసీలు జనాభా ప్రాతిపదికన రాజకీయ వాటా కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. జనాభాలో బీసీల సంఖ్య గణనీయంగా ఉన్నా, చట్టసభల్లో ప్రాతినిథ్యం ఆశించినంత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో బీసీ రాజ్యాధికారం సాధించడమే లక్ష్యమని తెలిపారు. షాద్‌నగర్‌ పరిధిలో నిర్మించ తలపెట్టిన లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ను వెంటనే పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలన్నారు. సిద్ధాపూర్‌లో డంపింగ్‌ యార్డు ప్రతిపాదనను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

టీఆర్‌పీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement