‘లక్ష’ణంగా గణపతి లడ్డూలు | - | Sakshi
Sakshi News home page

‘లక్ష’ణంగా గణపతి లడ్డూలు

Sep 21 2026 7:23 AM | Updated on Sep 21 2026 7:23 AM

‘లక్ష’ణంగా గణపతి లడ్డూలు

తుర్కయంజాల్‌: ఆదిభట్ల సర్కిల్‌ పరిధి బ్రాహ్మణపల్లిలోని ఏపీఆర్‌ గోల్డెన్‌ లీఫ్‌లో నిర్వహించిన గణేశ్‌ లడ్డూ వేలం పాటలో ఏగినేని వేణుగోపాల్‌ చౌదరి, మౌనిక రెడ్డి దంపతులు రూ.10 లక్షలకు దక్కించుకున్నారు. వేలం పాటలో లడ్డూను దక్కించుకోవడం ఆనందంగా ఉందని, ప్రజలంతా సుఖ, సంతోషాలతో ఉండాలని వినాయకుడిని కోరుకున్నట్లు వారు పేర్కొన్నారు.

గానుగుమార్లతండాలో..

కడ్తాల్‌: మండల పరిధిలోని గానుగుమార్లతండా పంచాయతీలో నవతరం యూత్‌ అసోసియేషన్‌ గణపతి మండపం వద్ద నిర్వహించిన లడ్డూ వేలం పాటలో పెద్ద లడ్డూను తండాకు చెందిన బీజేపీ రాష్ట్ర నాయకుడు బాణావత్‌ శంకర్‌నాయక్‌ రూ.1.85 లక్షలకు సొంతం చేసుకున్నాడు. చిన్న లడ్డూను మునావత్‌ ఉమేశ్‌ రూ.లక్షకు దక్కించుకున్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు దశరథ్‌నాయక్‌, సర్పంచ్‌ సేవ్యానాయక్‌, మాజీ సర్పంచ్‌ మోత్యానాయక్‌ పాల్గొన్నారు.

బొజ్జగణపయ్య లడ్డూ రూ.4.2 లక్షలు

మొయినాబాద్‌: మున్సిపల్‌ కేంద్రంలోని అంగడి బజార్‌లో ప్రతిష్ఠించిన వినాయకుడి లడ్డూ వేలంపాటలో రూ.4 లక్షల 2 వేలు పలికింది. ఆదివారం రాత్రి వినాయకుడిని నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా చేపట్టిన లడ్డూ వేలంపాటలో మొయినాబాద్‌కు చెందిన చిరాగ్‌ మోహన్‌గౌడ్‌ బ్రదర్స్‌ రూ.4 లక్షల 2 వేలకు వినాయకుడి లడ్డూను దక్కించుకున్నారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు షాబాద్‌ దర్శన్‌, కౌన్సిలర్‌ వాజిద్‌, ఏఎంసీ డైరెక్టర్‌ సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీ మోహన్‌గౌడ్‌, మాజీ ఉపసర్పంచ్‌ రాజేష్‌గౌడ్‌, నాయకులు రాజుగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement