సోమవారం శ్రీ 21 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

సోమవారం శ్రీ 21 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

Sep 21 2026 7:23 AM | Updated on Sep 21 2026 7:23 AM

సోమవారం శ్రీ 21 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026 8లోu

న్యూస్‌రీల్‌

ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం..

సాక్షి, రంగారెడ్డిజిల్లా: సరూర్‌నగర్‌, శంషాబాద్‌ మండలాల పరిధిలో మాత్రమే కాదు జిల్లాలోని మెజార్టీ మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. బీఎల్‌ఓలు స్వయంగా ఓటర్ల ఇంటికి వెళ్లి నోటీసులు అందజేయాలి. ఆ వెంటనే వారి నుంచి అవసరమైన ధ్రువపత్రాలు సేకరించాలి. కానీ మెజార్టీ బీఎల్‌ఓలు పంచాయతీ ఆఫీసులు, మున్సిపల్‌ వార్డులు, కమ్యూనిటీ కేంద్రాల్లో కూర్చొని ఫోన్లు చేస్తున్నారు. ఫలితంగా మెజార్టీ ఓటర్లకు ఇప్పటికీ నోటీసులు అందలేదంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించి, బీఎల్‌ఓల పనితీరును పర్యవేక్షించాల్సిన మండల, జిల్లా స్థాయి ఎన్నికల కమిషన్‌ అధికారులు పట్టించుకోకపోవడంతో క్షేత్రస్థాయిలోని బీఎల్‌ఓలు, ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు కార్యక్రమాన్ని లైట్‌ తీసుకున్నారు.

మళ్లీమళ్లీ తిరగలేక..

జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో మొత్తం 12,33,490 మంది ఓటర్లకు నోటీసులు జారీ అయ్యాయి. వీటిలో 8,92,475 మాత్రమే ఓటర్లకు చేరాయి. మరో 3,41,015 ఇప్పటికీ బీఎల్‌ఓల వద్దే ఉండిపోయాయి. ఇప్పటి వరకు నోటీసులు అందుకున్న వారిలో 4,83,444 మంది తమ ధ్రువీకరణ పత్రాలు సమర్పించారు. హియరింగ్‌ కూడా పూర్తయింది. మరో 6,11,872 మంది ఓటర్లు నోటీసులు తీసుకున్నప్పటికీ స్పందించడం లేదు. సర్‌ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే 2002, 2025 ఓటర్ల జాబితాలోని ఓటు వివరాలను ఎన్యూమరేషన్‌ పత్రాల్లో లిఖిత పూర్వకంగా నమోదు చేసి బీఎల్‌ఓలకు అందజేసిన ఓటర్లు.. ఎన్నికల కమిషన్‌ సిబ్బంది నిర్లక్ష్యం మూలంగా ఓటర్ల ముసాయిదాలో దొర్లిన (ఇంటిపేరు, ఓటరు పేరు, ఆధార్‌ కార్డుల్లో తప్పులు దొర్లిన) తప్పిదాలకు మళ్లీ మళ్లీ సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వస్తుండటం మెజార్టీ ఓటర్లు ఇబ్బందిగా భావిస్తున్నారు. ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు.

సరూర్‌నగర్‌ మండలంలో 20,144 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయగా, వీటిలో 11,241 మాత్రమే ఓటర్ల చేతికి అందాయి. మరో 8,903 బీఎల్‌ఓల వద్దే పెండింగ్‌లో ఉండిపోయాయి. శంషాబాద్‌ మండల పరిధిలోని 21 పంచాయతీల్లో 6,807 నోటీసులకు హియరింగ్‌ పూర్తి కాగా, మరో 3,309 పెండింగ్‌లో ఉన్నాయి.

ఇంటికి వెళ్లలే..

నోటీసులు ఇవ్వలే..

కమ్యూనిటీ హాళ్లలో కూర్చొని ఫోన్లు

లక్షల్లో నోటీసులు బీఎల్‌ఓల వద్దే పెండింగ్‌

నోటీసులు అందుకున్నా స్పందించనివారు ఎందరో..

గందరగోళంగా ప్రత్యేక సమగ్ర సవరణ

నియోజకవర్గం పురుషులు మహిళలు ఇతరులు మొత్తం

ఇబ్రహీంపట్నం 1,29,464 1,29,835 18 2,59,317

ఎల్బీనగర్‌ 1,69,718 1,68,135 66 3,37,919

మహేశ్వరం 1,68,622 1,70,654 30 3,39,306

రాజేంద్రనగర్‌ 1,95,556 1,92,706 16 3,88,278

శేరిలింగంపల్లి 2,26,448 2,17,030 66 4,43,544

చేవెళ్ల 1,08,833 1,09,438 03 2,18,274

కల్వకుర్తి 1,09,734 1,07,153 03 2,16,890

షాద్‌నగర్‌ 1,04,006 1,05,111 07 2,09,124

పరిగి 1,12,589 1,10,808 07 2,23,404

వికారాబాద్‌ 92,104 93,605 17 1,85,726

తాండూరు 90,804 95,895 05 1,86,704

కొడంగల్‌ 1,04,762 1,06,773 05 2,11,540

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement