ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలి

Sep 21 2026 7:23 AM | Updated on Sep 21 2026 7:23 AM

ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలి పీసీసీ అధ్యక్షుడికి కృతజ్ఞతలు రక్తదానంలో హాఫ్‌ సెంచరీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు

షాద్‌నగర్‌: రైలులో ప్రయాణించే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని ఆర్‌పీఎఫ్‌ ఎస్‌ఐ శ్రీనివాస్‌ రెడ్డి సూచించారు. అఖిల భారత రైల్వే రక్షణ దళం రైజింగ్‌ డేను పురస్కరించుకొని ఆదివారం ఆర్‌పీఎఫ్‌ కార్యాలయం వద్ద పరిసరాలను పరిశుభ్రం చేశారు. రైల్వే ప్రయాణికులకు అవగాహన కల్పించడంతో పాటు నవోదయ ఆశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. రైలులో ప్రయాణించే సమయంలో ప్రయాణికులు విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలని అన్నారు. దొంగతనాలను నివారించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసర సమయాల్లో రైల్వే హెల్ప్‌లైన్‌ 139కు డయల్‌ చేయాలన్నారు. ప్రయాణికుల భద్రత కోసం ప్రత్యేక బందోబస్తు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పోలీసు సిబ్బందికి సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో ఏఎస్‌ఐ అబ్దుల్‌ ఖమర్‌, కానిస్టేబుళ్లు జయవీర్‌, రాంపూజన్‌సింగ్‌, సునీత తదితరులు పాల్గొన్నారు.

బడంగ్‌పేట్‌: డీసీసీ అధ్యక్షురాలిగా నియమితులైన చిగురింత పారిజాత నర్సింహారెడ్డి దంపతులు ఆదివారం పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి నియామకానికి పూర్తి సహకారం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు వంగేటి ప్రభాకర్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, పార్టీ నాయకులు ఉన్నారు.

మొయినాబాద్‌: మున్సిపాలిటీలోని ఎనికేపల్లికి చెందిన 9వ వార్డు కౌన్సిలర్‌ ముదిగొండ ప్రభాకర్‌ యాదవ్‌ రక్తదానం చేయడంలో హాఫ్‌ సెంచరీ దాటారు. ప్రధాని మోదీ ప్రజాజీవితం 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో 51వసారి రక్తదానం చేసి రికార్డు సృష్టించారు. రక్తదానం చేయడం అంటే ఇతరులకు ప్రాణదానం చేయడమే అని.. అందుకే ప్రతి మూడు నెలలకోసారి రక్తదానం చేస్తున్నాని ఆయన తెలిపారు. 51వ సారి రక్తదానం చేసిన కౌన్సిలర్‌ ప్రభాకర్‌ను చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం శాలువాతో సన్మానించి అభినందించారు.

మొయినాబాద్‌రూరల్‌: రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్‌)అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. మండల పరిధిలోని తోల్‌కట్ట చౌరస్తాలో ఆదివారం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అభివృద్ధి కోసం ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ చేవెళ్ల నియోజకవర్గ ఇన్‌చార్జి బ్యాగరి రాజు, మండల అధ్యక్షుడు ఎత్‌మార్‌పల్లి భిక్షపతి, యూత్‌ అధ్యక్షులు పవన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement