ఆలయాలు హిందూ చరిత్రకు మూలం | - | Sakshi
Sakshi News home page

ఆలయాలు హిందూ చరిత్రకు మూలం

Aug 10 2026 7:20 AM | Updated on Aug 10 2026 7:20 AM

ఆలయాలు హిందూ చరిత్రకు మూలం

కుల్కచర్ల: ఆలయాలు హిందూ చరిత్రకు మూలమని బీజేపీ రాష్ట్ర నాయకుడు కరణం ప్రహ్లాదరావు అన్నారు. ఆదివారం ఆయన మండల పరిధిలోని ఘనపూర్‌లో శివరామగుర్గా క్షేత్రంలో ప్రత్యేకపూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మన ఆలయాలను మనమే పరిరక్షించుకోవాలని, హిందూ ధర్మానికి చరిత్రకు ఆలయాలే మూలాధారమన్నారు. అనంతరం బుయ్యని విజయలక్ష్మీవెంకటరెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త ఘణపురం వెంకటయ్య, కుల్కచర్ల సర్పంచ్‌ అంజిలయ్య, ఉప సర్పంచ్‌ విజయకుమార్‌, ఘనపూర్‌ మాజీ సర్పంచ్‌ విజయలక్ష్మిగోపాల్‌, దిశ కమిటీ జిల్లా సభ్యుడు జానకిరాం, బీజేపీ మండల అధ్యక్షుడు వెంకటయ్య, జిల్లా కార్యవర్గసభ్యులు మైపాల్‌, కాటనిపల్లి అంజిలయ్య, పీఎన్‌పీఎస్‌ సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు రాఘవేంధర్‌ గౌడ్‌, నాయకులు అంజనేయులు, రాంచంద్రయ్య, సాయికిరణ్‌, చంద్రయ్య, జి.మైపాల్‌, డి.అంజిలయ్య, మోహన్‌, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ రాష్ట్ర నాయకుడు ప్రహ్లాదరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement