● పగటి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. గాల్లో తేమశాతం పెరగడంతో వైరస్ వ్యాప్తికి అనుకూలంగా ఉంటుంది. శరీరం ఈ మార్పులకు అలవాటు పడేందుకు కొంతసమయం పడుతుంది. రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఫ్లూ కారక వైరస్‌లు సులభంగా వ్యాపిస్తుంటాయి. దగ్గు, జలుబు, జ్వరం ఒకరి నుంచి మరొకరికి విస్తరిస్తుంటాయి. ఈ లక్షణాలతో కన్పించే పిల్లలను బడికి పంపకపోవడం ఉత్తమం.
● ప్రస్తుతం చెరువుల్లోకి కొత్త నీరు వచ్చి చేరుతోంది. వరదతో పాటే అనేక రకాల బ్యాక్టీరియా చేరుతోంది. సరిగా శుద్ధి చేయని ఈ నీటిని తాగడం ద్వారా ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. కలుషిత నీరు పైపుల నుంచి ఇంట్లోకి సరఫరా అవుతుండడం, విషయం తెలియక వాటిని అలాగే తాగడం ద్వారా వాంతులు, విరేచనాల బారినపడుతుంటారు.
● సాధ్యమైనంత వరకు ఇంటికప్పుపై ఉన్న ఖాళీ బా టిళ్లు, కుండీల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. మంచినీటి ట్యాంకులపై మూత పెట్టాలి. మస్కిటో కాయిల్స్, మస్కిటో మ్యాట్, కిటికీలకు జాలీలను ఏర్పాటు చేసుకోవడం, కాళ్లు, చేతులు పూర్తిగా కప్పి ఉంచేలా దుస్తులు ధరించడం, దోమ తెరలను వాడటం వంటి స్వీయ జాగ్రత్తలతో డెంగీని దరిచేరనీయకుండా చూసుకోవచ్చు.
● సాధ్యమైనంత వరకు బయటి ఆహారాన్ని తీసుకొవద్దు. నిల్వ చేసిన ఆహారానికి బదులు ఇంట్లో అప్పుడే తాజాగా వండివార్చిన ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం. కాచి చల్లార్చిన నీటిని తాగడం, సీవిటమిన్ పుష్కలంగా లభించే తాజా పండ్లు తినడం ద్వారా సీజనల్ వ్యాధుల బారి నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.


