సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన చేవెళ్ల ఎమ్మెల్యే | - | Sakshi
Sakshi News home page

సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన చేవెళ్ల ఎమ్మెల్యే

Feb 18 2026 8:32 AM | Updated on Feb 18 2026 8:32 AM

సీఎం

సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన చేవెళ్ల ఎమ్మెల్యే

సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన చేవెళ్ల ఎమ్మెల్యే అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానం చెందిప్ప సన్నిధిలో సినీ రచయిత విజయేంద్రప్రసాద్‌ ఆరోగ్య పథకాన్ని పునఃసమీక్షించాలి జేఈఈలో ప్రతిభ

చేవెళ్ల: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నగరంలోని ఆయన నివాసంలో కలిసి నియోజజకవర్గంలోని మూడు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ జెండా ఎగురవేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం ప్రత్యేకంగా అభినందించారు. మున్సిపాలిటీల అభివృద్ధికి సహకారం అందిస్తామని తెలిపారని ఎమ్మెల్యే చెప్పారు.

షాద్‌నగర్‌: ఢిల్లీలో ఈనెల 22, 23 తేదీల్లో శయుక్షక్‌ ఫౌండేషన్‌, యూనివర్సిటీ ఆఫ్‌ ఢిల్లీ సంయుక్తంగా నిర్వహించనున్న అంతర్జాతీయ సెమినార్‌ను షాద్‌నగర్‌ పట్టణానికి అర్ధశాస్త్ర అధ్యాపకుడు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సామ రవీందర్‌రెడ్డికి ఆహ్వానం అందింది. ‘అంబేడ్కర్‌ సొసైటీ అండ్‌ హ్యూమన్‌ వాల్యూస్‌, రీ ఇమాజిన్‌ ఇంటెగ్రల్‌ హ్యూమనిజం ఇన్‌ ది ఏఐ ఏరా’ అంశంపై జరిగే సదస్సుకు వివిధ దేశాలకు చెందిన ప్రొఫెసర్లు, విద్యావేత్తలు హాజరు కానున్నారు. ఈ సదస్సుకు తనకు ఆహ్వానం అందడం ఆనందంగా ఉందని డాక్టర్‌ రవీందర్‌రెడ్డి అన్నారు.

శంకర్‌పల్లి: దేశంలో బ్రహ్మసూత్ర మరకత శివలింగాలు చాలా అరుదుగా ఉన్నాయని, వాటిలో ఒకటి శంకర్‌పల్లిలో ఉందని సినీ రచయిత, రాజ్యసభ సభ్యుడు విజయేంద్రప్రసాద్‌ అన్నారు. మంగళవారం ఆయన మండలంలోని చెందిప్ప గ్రామంలో వెలసిన 11వ శతాబ్దపు శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయాన్ని దర్శించుకున్నారు. లింగానికి ప్రత్యేక పూజలు చేసిన అంనంతరం మాట్లాడారు. మరకత శివాలయం ఎంతో అద్భుతంగా ఉందని, ఇది భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్‌ గోపాల్‌రెడ్డి ఆయనకి శేషవస్త్రం, ఆలయ ప్రతిమ ఇచ్చి సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు ప్రమోద్‌, శివ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఇబ్రహీంపట్నం రూరల్‌: ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని పునః సమీక్షించాలని టీజీఓ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ కె రామారావు, శ్రీనేష్‌ కుమార్‌ నోరి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు టీజీఓ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం టీజీఓ సెంట్రల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస్‌రావు, ప్రధాన కార్యదర్శి శ్యామ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈఎస్‌హెచ్‌ పైనా ప్రభుత్వంతో రాబోయే రోజుల్లో చర్చలు జరపాలని, వినతులను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వానికి నివేదించాలని కోరారు.

శంకర్‌పల్లి: జేఈఈ సెషన్‌–1 ఫలితాల్లో పట్టణానికి చెందిన మల్గారి ప్రణవిరెడ్డి ప్రతిభ చాటింది. జేఈఈ–2026 సెషన్‌–1లో 98.59 పర్సంటైల్‌ సాధించింది. ఆమె 10వ తరగతిలో 10 జీపీఏ, ఇంటర్‌ మొదటి సంవత్సరంలో 467 మార్కులు సాధించింది. కూతురు సాధించిన మార్కులపై ఆమె తల్లిదండ్రులు వెంకట్‌రాంరెడ్డి, కృష్ణవేణి ఆనందం వ్యక్తం చేశారు.

సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన చేవెళ్ల ఎమ్మెల్యే
1
1/4

సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన చేవెళ్ల ఎమ్మెల్యే

సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన చేవెళ్ల ఎమ్మెల్యే
2
2/4

సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన చేవెళ్ల ఎమ్మెల్యే

సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన చేవెళ్ల ఎమ్మెల్యే
3
3/4

సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన చేవెళ్ల ఎమ్మెల్యే

సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన చేవెళ్ల ఎమ్మెల్యే
4
4/4

సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన చేవెళ్ల ఎమ్మెల్యే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement