ఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదగాలి
ఇబ్రహీంపట్నం: ఆర్య వైశ్యులందరూ రాజకీయంగా ఎదగాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. నగర సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం జరిగిన రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆత్మీయ సమ్మేళనానికి హాజరై 2026 నూతన సంవత్సరం క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఆ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్‌రెడ్డి మాట్లాడారు. ఆర్యవైశ్యులకు రేవంత్ సర్కార్ అన్నివిధాల అండగా నిలుస్తుందన్నారు. మలక్‌పేట ఎమ్మెల్యేగా గతంలో తను కొనసాగినప్పుడు ఆర్‌కే పురంలోని అష్టలక్ష్మీ దేవాలయానికి సంపూర్ణ సహకారం అందించిన విషయాన్ని గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో ఆర్యవైశ్యులకు టికెట్ల కేటాయింపులో తనవంతు సహకారం ఉంటుందన్నారు. అనంతరం ఆ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనారాయణ మాట్లాడారు.
మున్సిపల్, జీహెచ్‌ఎంసీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆర్యవైశ్యులు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధులు ఆర్ గణేశ్‌గుప్తా, చింతల రవికుమార్ గుప్తా, ఉప్పల శారద, పసునూరి శ్రీనివాస్‌గుప్తా, సురేష్‌గుప్తా, బిల్లకంటి కిరణ్‌కుమార్‌గుప్తా, ఎ వెంకటేశ్, కే మల్లిఖార్జున్, సామ్రాజ్యలక్ష్మీ, కే. సత్యనారాయణ, సురేష్, లక్ష్మణ్, రమేష్, లక్ష్మయ్య, రమాదేవిలు పాల్గొన్నారు.
ఉన్నతి, శిక్ష ఫౌండేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ
ఆమనగల్లు: తలకొండపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం ఉన్నతి అండ్ శిక్ష (యూఎస్) ఫౌండేషన్ నూతన క్యాలెండర్‌ను తహసీల్దార్ రమేశ్, ఫౌండేషన్ చైర్మన్ ఎర్ర సుధాకర్‌రెడ్డిలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి బండి రఘుపతి, సభ్యులు శ్రీరాములు, రమేశ్, నితిన్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి


