నిషేధిత జాబితా నుంచి తొలగించాలి
ఇబ్రహీంపట్నం రూరల్: రాందాస్‌పల్లి రైతుల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి పేర్కొన్నారు. ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబరు 41 పట్టా భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కోరుతూ బీఆర్‌ఎస్ భువనగిరి పార్లమెంట్ ఇన్‌చార్జి క్యామ మల్లేశ్ ఆధ్వర్యంలో బుధవారం రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్‌తో పాటు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అనంతరం వారు కలెక్టర్‌తో రైతుల సమ్యలు వివరించారు. వారందరూ చిన్న, సన్నకారులేనని వారి భూములను నిషేధిత జాబితాలో ఉంచడం బాధాకరమన్నారు. యేండ్ల తరబడి ఈ సమస్య ఉందని, రెవెన్యూ సదస్సుల్లో కూడా రైతులందరూ అధికారులకు దరఖాస్తులు చేసుకున్నారని గుర్తు చేశారు. వందల మంది రైతులు తమ భూములను సాగు చేసుకోలేక, అవసరాల కోసం అమ్ముకోలేక అవస్థలు పడుతున్నారన్నారు. కనీసం రైతుబంధు, రైతుబీమా కూడా మంజూరు కావడం లేదన్నారు. కలెక్టర్ స్పందించి పూర్తి స్థాయిలో విచారణ జరిపించి రైతులకు న్యాయం చేయాలని కోరారు.
కలెక్టర్‌ను కోరిన రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి


