
పట్టుదలతోనే క్రీడల్లో రాణింపు
హుడాకాంప్లెక్స్: కృషి, పట్టుదల ఉంటే క్రీడల్లో రాణించవచ్చని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. క్రీడలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 2025 స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చారని చెప్పారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా బుధవారం ‘రాజీవ్ గాంధీ ఖేల్ ఉత్సవ త్రికే రన్’ పేరిట ఓమ్నీ ఆస్పత్రి నుంచి సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం వరకు నిర్వహించారు. ఈ రన్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్, ఎల్‌బీనగర్ ఇన్‌చార్జి మధుయాస్కీగౌడ్, క్రీడా ప్రాధికారిక సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి, ఎమ్మెల్సీ దయానంద్‌గుప్తా, పీసీసీ సభ్యుడు దేప భాస్కర్‌రెడ్డిలతో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ యువత డ్రగ్స్, మద్యపానానికి అలవాటు పడొద్దని, పాఠశాల, కళాశాల అయిపోయిన వెంటనే గ్రౌండ్‌కు పరుగులు తీయాలన్నారు. 2035లో ఒలింపిక్ పోటీలలో పాల్గొనేలా క్రీడాకారులను తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. నేడు తల్లిదండ్రులు సైతం పిల్లలను ఆటల్లో ప్రోత్సహిస్తున్నారని గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి క్రీడాకారుడు మత్తు వదిలి మైదానం బాట పట్టమని రాహుల్‌గాంధీ పిలుపునిచ్చారని తెలిపారు. ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధిస్తే శంషాబాద్ నుంచి భారీ ర్యాలీ తీసి గౌరవిస్తామని, కోచ్‌ల కొరత లేకుండా చేస్తామన్నారు. శిక్షణ ఇచ్చేలా త్వరలో మైదానాలు అందుబాటులో ఉంచుతామని వివరించారు. స్టేడియంలో జిమ్ ఇతర వసతులు కల్పించడానికి రూ.200 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో పార్టీ నాయకుడు ఉపేందర్‌రెడ్డి, జిల్లా క్రీడా అధికారి వెంకటేశ్వర్‌రావు, కోశాధికారి రాజశేఖర్, కోచ్‌లు విజయ్‌కుమార్, సాయిబాబా, రమాదేవి, యాదయ్య, జనయ్‌సింగ్, కిషోర్, సైదులు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి వాకిటి శ్రీహరి