
మహాధర్నాను విజయవంతం చేయండి
పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి
మొయినాబాద్/శంకర్‌పల్లి: సీపీఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలనే డిమాండ్‌తో సెప్టెంబర్ 1న ఇందిరా పార్కు వద్ద నిర్వహించే మహాధర్నాను విజయవంతం చేయాలని పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి కోరారు. బుధవారం మొయినాబాద్ మున్సిపాలిటీలోని అజీజ్‌నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మహాధర్నా వాల్‌పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాధర్నాకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో తరలిరావాలన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అయిన పెన్షన్‌ను సాధించుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి క్రిష్ణారెడ్డి, ఎంఈఓ మల్లయ్య, మండల అధ్యక్షుడు బందయ్య, హెచ్‌ఎంలు రఘునాథ్, శేఖర్‌రెడ్డి, అబ్దుల్ హమీద్, నాయకులు వెంకటయ్య, హమీద్, లక్ష్మణ్, రాములు, శివకుమార్, భీమ్లా, యాదగిరి, విజయ్‌కుమార్, విజయబాయ్, రాధా, శారద, శ్రీదేవి, మంగ తదితరులు పాల్గొన్నారు. అనంతరం శంకర్‌పల్లి తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు.