
మండపాలకు అనుమతి తప్పనిసరి
శంకర్‌పల్లి: వినాయక మండపాలు ఏర్పాటు చేసే వారు పోలీసుల నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని శంకర్‌పల్లి మున్సిపల్ కమిషనర్ యోగేశ్, సీఐ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సోమవారం శంకర్‌పల్లి పట్టణంలోని ఓ ప్రైవేటు గార్డెన్స్‌లో మండపాల నిర్వహకులతో సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గణేశ్ పండగను సంప్రదాయబద్ధంగా నిర్వహించుకునేందుకు ప్రతిఒక్కరూ సహకరించుకోవాలని, డీజేలకు ఎలాంటి అనుమతి ఉండదని స్పష్టం చేశారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమించి సౌండ్ సిస్టం పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో మున్సిపల్ మేనేజర్ అంజన్ కుమా ర్, విద్యుత్ శాఖ ఏఈ ప్రదీప్, ఎస్సైలు సురేశ్, దేవేందర్, శ్రీశైలం, బేతప్ప పాల్గొన్నారు.