
నేడు భూ భారతిపై అవగాహన సదస్సు
అబ్దుల్లాపూర్‌మెట్: భూ భారతిపై సోమవారం అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పెద్దఅంబర్‌పేట ఔటర్ రింగ్‌రోడ్డు సమీపంలోని తారా కన్వెన్షన్ హాల్‌లో ఉ దయం 10.30 గంటల నిర్వహించే కార్యక్రమా నికి కలెక్టర్ నారాయణరెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డిరంగారెడ్డి హాజరు కానున్నట్టు తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన రైతులు, ప్రజలు పాల్గొని సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు.
కందుకూరులో..
కందుకూరు: భూ భారతి చట్టంపై సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు మండల కేంద్రంలోని టంకరి రాంరెడ్డి ఫంక్షన్‌హాల్‌లో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ గోపాల్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కలెక్టర్ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్న సదస్సుకు ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే సబితారెడ్డితో పాటు ప్రజాప్రతినిధులు హాజరుకానున్నట్టు ఆయన తెలిపారు.
ఇంటర్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
మొయినాబాద్‌రూరల్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వా నిస్తున్నట్టు చేవెళ్ల సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ మాలతి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు మార్కుల ఆధారంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈ ఒకేషనల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. మే 15వ తేదీలోపు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు చెప్పారు. పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
దక్షిణాది రాష్ట్రాలపైకేంద్రం వివక్ష
షాబాద్: దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపడం బాధాకరమని సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య అన్నారు. మండల పరిధిలోని నాగర్‌కుంటలో ఆదివారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దక్షిణాది రాష్ట్రాలకు రావాల్సిన నిధులు, నిర్మాణాలు, అభివృద్ధి విషయంలో వివక్ష ప్రదర్శిస్తోందని విమర్శించారు. ఆర్థిక, రాజకీయ, సామాజిక పరంగా అన్నింట్లో వివక్ష చూపడం ఏమిటని ప్రశ్నించారు. మోదీ, బీజేపీ నాయకులు ఉగ్రవాద ఘటన నుంచి రాజకీయ లబ్ధి పొందాలని చూడడం హేయమైన చర్యగా అభివర్ణించారు. రాజకీయాలకు అతీతంగా దేశ ప్రజలంతా ఉగ్రవాదంపై ముక్తకంఠంతో నినదించాలని అన్నారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా సభలు, సమావేశాలు నిర్వహించాలని కేడర్‌కు సూచించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సమితి సభ్యుడు, చేవెళ్ల నియోజకవర్గ కార్యదర్శి కె.రామస్వామి, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వడ్ల సత్యనారాయణ, నాయకులు ఆనందం, నర్సింహులు, రమేష్, తదితరులు పాల్గొన్నారు.
మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి
మీర్‌పేట: మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని జిల్లా శ్రామిక మహిళా కన్వీనర్ కవిత పిలుపునిచ్చారు. మీర్‌పేటలోని సీఐటీయూ కార్యాలయం వద్ద ఆదివారం మేడే పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. వేడుకల్లో కార్మికులందరూ పాల్గొని ఐక్యత చాటాలన్నారు. కార్మిక చట్టాల రక్షణ కోసం మే 20 నుంచి జరగనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీఐటీయూ మండల కన్వీనర్ శేఖర్ యాదవ్, దాసరి బాబు, యాదయ్యచారి, సత్యం, మల్లికార్జున్, వెంకయ్య, ఆంజనేయులు, సోమ్లానాయక్, చిన్నబాబు, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

నేడు భూ భారతిపై అవగాహన సదస్సు