‘నీరా’ కేంద్రాన్ని సందర్శించిన ఏపీ ఎకై ్సజ్ అధికారులు
కడ్తాల్: మండల పరిధిలోని ముద్వీన్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ‘నీరా’ తయారీ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ డివిజన్ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి, ఎకై ్స జ్‌శాఖ అధికారులతో కలిసి ఆదివారం సందర్శించారు. గీత కార్మికులకు లాభాలు చేకూర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన నీరా తయారీ విధానాన్ని పరిశీలించారు. చెట్టు నుంచి ఏ విధంగా సేకరిస్తున్నారు.. ఎంత మేర ఉత్పత్తి అవుతోంది.. నీరా నుంచి అదనపు ఉత్పత్తుల (బై ప్రొడక్ట్) ను ఎలా తయారు చేయాలి తదితర విషయాలను నీరా కేంద్రం శాస్త్రవేత్త సత్యంను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చరికొండ గ్రామంలో పర్యటించి తాటి చెట్ల నుంచి నీరా సేకరణ గురించి గీత కార్మికులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ సీఐ బధ్యానాథ్ చౌహన్, ఎస్‌ఐ అరుణ్‌కుమార్, ఈసీ బాబు తదితరలు పాల్గొన్నారు.
ఆలయ హుండీలో రద్దయిన రూ.2వేల నోట్ల కట్టలు
పహాడీషరీఫ్: ఆలయ హుండీలో రద్దయిన రూ.2వేల నోట్ల కట్టలు రెండు బయటపడ్డాయి. ఈ సంఘటన బాలాపూర్ మండలం మామిడిపల్లిలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామంలోని దాసాంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం శ్రీరామ నవమి సందర్భంగా కల్యాణోత్సవం అనంతరం గత ఏడాది కాలానికి సంబంధించి హుండీ లెక్కింపు కోసం ఆలయ కమిటీ సభ్యులు తెరిచారు. అందులో రద్దయిన రూ.2 వేల నోట్ల కట్టలు రెండు బయటపడ్డాయి. వాటిని లెక్కించగా రూ.2 లక్షలుగా తేలింది. దీనిని ఆర్‌బీఐ దృష్టికి తీసుకెళ్తామని నిర్వాహకులు తెలిపారు.
24న చుక్కా రామయ్య ప్రవేశ పరీక్ష
అనంతగిరి: ఐఐటీ చుక్కా రామయ్య ట్రస్ట్‌లో ఉచిత విద్య కోసం ఈ నెల 24న ప్రవేశపరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ వెంకటరత్నం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ పాఠశాల్లో చదువుతున్న విద్యార్థులకు 5, 6, 7 తరగతుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ఎంట్రెన్స్‌కు ఈ నెల 18వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 94404 83015, 96521 802819, 98495 85729, 94916 76672 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
స్నేహితుల దాడిలో పెయింటర్ మృతి
మల్కాజిగిరి: స్నేహితుడిపై దాడి చేయడంతో తీవ్ర గాయాలై చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ కథనం ప్రకారం.. మౌలాలికి చెందిన ఆకాశ్ సింగ్ (29) పెయింటర్. ఇదే ప్రాంతా నికి చెందిన ఇంతియాజ్, ఆకాశ్ ఇద్దరూ స్నేహితులు. వ్యక్తిగత కారణాలతో కొంతకాలంగా ఇద్దరూ దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున ఇంతియాజ్ సోద రుడు షారూక్ ఇంటికి రాకపోవడంతో అతడికి ఫోన్ చేశాడు. స్పందించకపోవడంతో జెడ్‌టీసీ గ్రౌండ్స్ వద్దకు వెళ్లి చూసేసరికి ఆకాశ్ సింగ్ అతడి మరో స్నేహితుడు కిషన్, షారూక్ మద్యం తాగుతూ కనిపించారు. దీంతో ఆగ్రహించిన ఇంతియాజ్ అతడితో తిరగొద్దని మందలించాడు. మాటామాటా పెరిగి గొడవకు దారి తీసింది. ఇంతియాజ్ సిమెంట్ ఇటుకతో ఆకాశ్ తలపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో సోదరులిద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనా స్థలంలో ఉన్న కిషన్.. విషయాన్ని ఆకాశ్ కుటుంబ సభ్యులకు చెప్పగా.. వెంటనే వారు అక్కడికి చేరుకుని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆకాశ్ మృతి చెందాడు. మృతుడి సోదరుడు రాజేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
‘నీరా’ కేంద్రాన్ని సందర్శించిన ఏపీ ఎకై ్సజ్ అధికారులు
‘నీరా’ కేంద్రాన్ని సందర్శించిన ఏపీ ఎకై ్సజ్ అధికారులు


