ఆలస్యంగా వచ్చానట! | Sakshi
Sakshi News home page

ఆలస్యంగా వచ్చానట!

Published Sat, Nov 11 2023 4:26 AM

-

సమయానికి రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి చేరుకోలేకపోయిన భారత చైతన్య యువజన పార్టీ రాజేంద్రనగర్‌ నియోజకవర్గ అభ్యర్థి వి.చంద్రశేఖర్‌ గౌడ్‌ నామినేషన్‌ను రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల దాటిన తర్వాత కార్యాలయానికి వచ్చారంటూ ఆయనను నామినేషన్‌ వేయకుండానే వెనక్కు పంపించారు. కాగా.. తాను 11 నుంచి 3 గంటల వరకు రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలోనే ఉన్నానని.. తన ముందు వచ్చిన వారి నామినేషన్లు తీసుకొని తనది పక్కన పెట్టారని చంద్రశేఖర్‌ గౌడ్‌ ఆరోపించారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానన్నారు. తాను 3 గంటలకు సమయం ముగుస్తుందనే విషయాన్ని 10 నిమిషాల ముందుగానే అనౌన్స్‌ చేయించానని రిటర్నింగ్‌ అధికారి వివరణ ఇచ్చారు.

– రాజేంద్రనగర్‌

Advertisement
 

తప్పక చదవండి

Advertisement