రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం

Nov 28 2026 1:32 AM | Updated on Nov 28 2026 1:32 AM

● ఎస్పీ మహేశ్‌ బీ గీతే

● ఎస్పీ మహేశ్‌ బీ గీతే

వేములవాడఅర్బన్‌: మద్యం సేవించి వాహనాలు నడిపితే వారితోపాటు ఇతరుల ప్రాణాలకూ ప్రమాదం జరుగుతుందని ఎస్పీ మహేశ్‌ బీ గీతే పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడిన వారితో శుక్రవారం వేములవాడ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో మద్యం సేవించి వాహనాలు నడపబోమని ప్రతిజ్ఞ చేయించారు. ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాద బాధితులు పీఎం రహత్‌ పథకం ద్వారా రూ.1.50లక్షల వరకు నగదు రహిత వైద్యసేవలు పొందవచ్చన్నారు. జిల్లాలోని ఏడు ఆస్పత్రుల్లో ఈ వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రమాద బాధితులను గోల్డెన్‌ అవర్‌లో ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడితే రూ.25వేలు ప్రోత్సాహకం అందించనున్నట్లు తెలిపారు. వేములవాడ టౌన్‌ సీఐ వీరప్రసాద్‌, ఎస్సైలు ప్రేమానందం, శ్రీనివాస్‌, రాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement