యూపీఎస్‌సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ | - | Sakshi
Sakshi News home page

యూపీఎస్‌సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

Nov 28 2026 1:32 AM | Updated on Nov 28 2026 1:32 AM

● జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి గొట్టె జయశ్రీ

● జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి గొట్టె జయశ్రీ

సిరిసిల్ల: జిల్లాలో యూపీఎస్‌సీ–2026లో మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థులకు ఉచితంగా ఇంటర్వ్యూ శిక్షణ, మార్గదర్శక కార్యక్రమాలు ప్రభుత్వం అందిస్తోందని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి గొట్టె జయశ్రీ శుక్రవారం తెలిపారు. అర్హులైన అభ్యర్థులకు సీనియర్‌ అధికారులతో ముఖాముఖీ, ఉద్యోగ విరమణ చేసిన, సీనియర్‌ (ప్రస్తుతం విధుల్లో ఉన్న) ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌, ఐఆర్‌ఎస్‌ అధికారులు, ప్రముఖ అధ్యాపకులతో మాక్‌ ఇంటర్వ్యూలు, ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ పద్ధతుల్లో నిర్వహించనున్నట్లు వివరించారు. అర్హత ఉన్న అభ్యర్థులు 2027 ఫిబ్రవరి 2వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలని కోరారు. వివరాల కోసం ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 040–23236112, మొబైల్‌ 90590 90062లో సంప్రదించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement