బాలల ఆరోగ్యానికో రికార్డు! | - | Sakshi
Sakshi News home page

బాలల ఆరోగ్యానికో రికార్డు!

Nov 28 2026 1:32 AM | Updated on Nov 28 2026 1:32 AM

● చిన్నారుల ఎత్తు, బరువు నమోదు ● అంగన్‌వాడీ కేంద్రాల్లో రికార్డుల కార్డులు ● కలెక్టర్‌ చొరవతో ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ అమలు

ఆరోగ్యంగా ఎదిగేందుకు సహకరిస్తుంది

లోపాలు కనిపెట్టొచ్చు

● చిన్నారుల ఎత్తు, బరువు నమోదు ● అంగన్‌వాడీ కేంద్రాల్లో రికార్డుల కార్డులు ● కలెక్టర్‌ చొరవతో ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ అమలు

ముస్తాబాద్‌: బాలల ఆరోగ్య రక్షణ ధ్యేయంగా జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అప్పుడే పుట్టిన చిన్నారి నుంచి ఐదేళ్ల వరకు బరువు, ఎత్తు వివరాలు నమోదు చేస్తున్నారు. ఇందుకు ప్రతీ చిన్నారికో కార్డును అందజేశారు. కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ చొరవతో ప్రత్యేక పర్యవేక్షణ కార్డులను తయారు చేయించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఎనిమిదేళ్ల క్రితం ఇలాంటి పర్యవేక్షణ కార్డులు ఉండేవి.. మధ్యలో ఆగిపోయిన ఆ కార్యక్రమాన్ని మళ్లీ ఇప్పుడు అమలు చేస్తున్నారు.

పర్యవేక్షణ కార్డులో ఇలా..

పోషణ్‌ అభియాన్‌లో భాగంగా మహిళల అభివృద్ధి, శిశుసంక్షేమశాఖ అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు నిత్యం పోషకాహారం అందిస్తుంది. పిల్లల ఎదుగుదల ఎలా ఉందో తెలియజేసే రికార్డులు లేవు. రక్తహీనత, ఎదుగుదల లేక జిల్లాలో చాలా మంది చిన్నారులు ఇబ్బందిపడుతున్నారు. ఎత్తు, బరువు వివరాలను ప్రతీ నెల నమోదు చేస్తారు. వయసుకు తగ్గట్టుగా బరువు, ఎత్తులో తేడాలు ఉన్న పిల్లలను గుర్తించి ఆర్‌బీఎస్‌కే అధికారులకు సమాచారం ఇస్తారు. రక్తహీనత, ఇతర కారణాలతో బాధపడే పిల్లలకు పోషకాహారం అందిస్తారు. ఇతరత్ర సమస్యలు ఉంటే వేములవాడలోని డీఈఐసీకి పంపిస్తారు. కార్డులో చిన్నారి పేరు, తల్లిదండ్రుల పేరు, ఊరు, పుట్టిన తేదీ, అంగన్‌వాడీ కేంద్రం పేరు, బరువు, ఎత్తు, జబ్బ చుట్టు కొలతలు నమోదు చేస్తారు.

మూడు రంగుల్లో సూచనలు

అతి తక్కువ బరువు ఉన్న పిల్లలను రెడ్‌కలర్‌, తక్కువ బరువు, ఎత్తు ఉంటే పసుపురంగు, సాధారణంగా ఉంటే ఆకుపచ్చరంగులో నమోదు చేస్తారు. బిడ్డపుట్టిన నుంచి ఆరు నెలల వరకు ఎలాంటి ఆహారం ఇవ్వాలో కార్డులో తెలియజేశారు. వివిధ వయసులలో చిన్నారుల ఆరోగ్యం కోసం పలు సూచనలు చేశారు. సరైన పోషన, ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. అంగన్‌వాడీ హెల్ప్‌లైన్‌ 1515 కూడా కార్డులో ఇచ్చారు. విటమిన్‌ ఏ పంపిణీ వివరాల నమోదు ఇచ్చారు. ప్రతీ నెల ఒకటో తేదీన పిల్లల పూర్తి వివరాలు కార్డుల్లో తప్పనిసరిగా నమోదు చేయాలి.

ప్రాజెక్టులు: సిరిసిల్ల, వేములవాడ

సిరిసిల్లలో కేంద్రాలు : 362

వేములవాడలో కేంద్రాలు : 224

గర్భిణులు : 3,224,బాలింతలు : 2,729

పిల్లలు : 31,270

అతి తీవ్ర పోషణ లోపం ఉన్న పిల్లలు : 137

మామూలు పోషణ లోపం ఉన్న పిల్లలు : 906

తక్కువ బరువు ఉన్న పిల్లలు : 293

పర్యవేక్షణ కార్డుల్లోని వివరాలు పిల్లల ఎదుగుదలలో లోపాలు ఉంటే మనకు తెలియజేస్తాయి. బరువు, ఎత్తును ప్రతీ నెల నమోదు చేసేలా చూస్తాం. కార్డులను తల్లిదండ్రులు తప్పనిసరిగా చూసుకోవాలి.

– గుండ్లపల్లి అనూష, సూపర్‌వైజర్‌

అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల పర్యవేక్షణ కార్డులు తీసుకొచ్చాం. చాలా మంది చిన్నారుల్లో ఎదుగుదల, తక్కువ బరువు ఉండడం, రక్తహీనత కనిపించింది. కార్డుల్లో ప్రతీ నెల వివరాలు నమోదు చేస్తారు. ఇబ్బందిపడే పిల్లలను గుర్తించి పోషకాహారం, చికిత్స అందిస్తాం. – గరీమా అగ్రవాల్‌, కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement