● కలెక్టర్ గరీమా అగ్రవాల్
వేములవాడఅర్బన్: రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను వీటీఏడీఏ వైస్ చైర్‌పర్సన్, కలెక్టర్ గరీమా అగ్రవాల్ శుక్రవారం పరిశీలించారు. అనివేటి మండపం, ఆలయ కోనేరు వద్ద కృష్ణశిలలతో చేయనున్న పనులను ఆర్‌అండ్‌బీ, ఆలయ అధికారులతో కలిసి పరిశీలించారు. పనుల పురోగతిపై ఆర్‌అండ్‌బీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో వేగం పెంచాలని సూచించారు. ఆర్‌అండ్‌బీ ఈఈ భీమ్లానాయక్, వేములవాడ ఆర్డీవో కుమారి, వేములవాడ మున్సిపల్ కమిషనర్ లోకేష్, ఆలయ ఈఈ రాజేష్, తహసీల్దార్ జయంత్‌కుమార్ పాల్గొన్నారు.


