ఎగువ మా‘నీరు’ విడుదల చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఎగువ మా‘నీరు’ విడుదల చేయాలి

Nov 28 2026 1:32 AM | Updated on Nov 28 2026 1:32 AM

ఎగువ మా‘నీరు’ విడుదల చేయాలి అభివృద్ధి పనులు ప్రారంభం అభ్యసన సామర్థ్యాలు పెంపొందించాలి నకిలీ కార్డులపై విచారణ చేపట్టాలి జిల్లా ఆస్పత్రిలో సదరం శిబిరాలు

గంభీరావుపేట: మండలంలోని నర్మాల ఎగువమానేరు ప్రాజెక్టు నుంచి యాసంగి వరి పంట సాగుకు నీటిని విడుదల చేయాలని కోరుతూ ఆయకట్టు రైతులు శుక్రవారం మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి మట్టం ఉందని, ఆయకట్టు భూములకు నీరు విడుదల చేయాలని కోరారు. ఎడబోయిన రాజు, మల్లేశ్‌, కల్యాణ్‌ కుమార్‌, ఆకునూరి రాజేందర్‌, శ్రీనివాస్‌, పెద్దవేని వెంకటి, మహేశ్‌ పాల్గొన్నారు.

సిరిసిల్ల అర్బన్‌: మున్సిపల్‌ ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి శుక్రవారం ప్రారంభించారు. 1వ వార్డులోని రూ.73 లక్షలతో సీసీ రోడ్డు, వర్క్‌షెడ్‌, 26వ వార్డులోని కొత్తచెరువు మినీట్యాంక్‌ బండ్‌పై రూ.5లక్షలతో ఓపెన్‌జిమ్‌ ప్రారంభించారు. కమిషనర్‌ ఖదీర్‌పాషా, వైస్‌ చైర్మన్‌ దార్ల సందీప్‌ పాల్గొన్నారు.

బోయినపల్లి: విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషిచేయాలని డీఈవో విజయసాగర్‌ సూచించారు. మండలంలోని కొదురుపాక ఎంపీపీఎస్‌ను శుక్రవారం సందర్శించారు. ఎఫ్‌ఎల్‌ఎన్‌లో భాగంగా నిర్వహించే మిడ్‌లైన్‌ పరీక్షల నిర్వహణ ఆన్‌లైన్‌ నమోదుపై సూచనలు చేశారు. హెచ్‌ఎం రవికుమార్‌, టీచర్లు సురేంద్రస్వామి, సుజాత ఉన్నారు.

సిరిసిల్లటౌన్‌: చేనేత, జౌళిశాఖ నకిలీ కార్డులపై విచారణ చేపట్టాలని సీపీఐ పట్టణ కార్యదర్శి పంతం రవి కోరారు. ఈమేరకు శుక్రవా రం ఆఫీస్‌ ఎదుట పింఛన్లు రాని వారితో కలి సి ధర్నా చేశారు. రవి మాట్లాడుతూ గతంలో ఇదే శాఖలోని కమ్యూనిటీ ఫెసిలిటేటర్ల ద్వారా పొందిన కార్డులను ఇప్పుడు నకిలీవని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. నాడు లంచాలు తీసుకుని రికార్డుల్లో నమోదు చేయకుండా కార్డులు ఇచ్చిన సీఎఫ్‌లపై, మొత్తం నకిలీ కార్డుల వ్యవహారంపై పోలీస్‌ విచారణ చేపట్టాలని కోరారు. రాపల్లి మధు, గణేశ్‌, నర్సయ్య, తిరుపతి, రాజేశం పాల్గొన్నారు.

సిరిసిల్ల: జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో సదరం శిబిరాలు నిర్వహించే తేదీలను ఆస్పత్రి పర్యవేక్షకుడు ప్రవీణ్‌కుమార్‌ శుక్రవారం తెలిపారు. డిసెంబరు 2, 10వ తేదీల్లో వినికిడి సమస్యలు, 3న జనరల్‌ సమస్యలు, డిసెంబరు 3, 4, 5, 7, 8, 9వ తేదీల్లో ఆర్థో సమస్యలు ఉన్న వారికి పరీక్షలు చేస్తారని వివరించా రు. డిసెంబరు 7, 14, 21, 28వ తేదీల్లో కంటి పరీక్షలు, 11, 16వ తేదీల్లో మానసిక సమస్యలతో బాధపడే వారికి పరీక్షలు చేస్తారని పేర్కొన్నారు. సంబంధిత మెడికల్‌ డాక్యుమెంట్స్‌, ఎక్స్‌ రే, యూడీఐడీ అప్లికేషన్‌ ఫామ్‌, ఆధార్‌కార్డ్‌, పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటో, ఫోన్‌ నంబర్‌ వెంట తీసుకొని ఉదయం 9 గంటలకు హాజరుకావాలని కోరారు.

దివ్యాంగులకు క్రీడాపోటీలు

సిరిసిల్లటౌన్‌: మనోధైర్యానికి ప్రతీకగా ది వ్యాంగుల క్రీడాపోటీలు నిలుస్తాయని జిల్లా రవాణాధికారి దేవునూరి శ్రీనివాస్‌, డీడబ్ల్యూవో లక్ష్మీరాజం పేర్కొన్నారు. అంతర్జాతీయ ది వ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సి రిసిల్ల పౌర సంక్షేమ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం సత్యసాయి సేవా మందిరంలో ది వ్యాంగుల క్రీడాపోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందించారు. సమితి అధ్యక్షుడు బియ్యంకార్‌ శ్రీనివాస్‌, చిప్ప దేవదాసు, ఎం.డి.మీరాజ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement