పెద్దపల్లి కలెక్టర్ సినరేజీ పేరుతో చేస్తున్న వసూళ్లు ఆర్టికల్ 265కి విరుద్ధం. లారీ యజమానులు నెలనెలా రూ.60వేల వరకు కలెక్టర్‌కు కప్పం కట్టాల్సి వస్తోంది. ఇది ముమ్మాటికీ దారి దోపిడీ. నిబంధనలను పక్కన బెట్టి అభివృద్ధి చార్జీలను వసూలు చేయడం విడ్డూరంగా ఉంది. అందుకే, కలెక్టర్‌పై డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రెయినింగ్ అండ్ పర్సన్ (డీవోపీటీ)కి, సీబీఐకి ఫిర్యాదు చేయబోతున్నా. ఇప్పటివరకూ అధిక లెవీ పేరిట కలెక్టర్ వసూలు చేసిన మొత్తాన్ని ఆయా లారీ యజమానులకు తిరిగి చెల్లించేదాకా పోరాటం ఆపేది లేదు. – కోరుకంటి చందర్,
రామగుండం మాజీ ఎమ్మెల్యే


