సరైన మార్గదర్శనంతో ఉన్నత శిఖరాలు | - | Sakshi
Sakshi News home page

సరైన మార్గదర్శనంతో ఉన్నత శిఖరాలు

Nov 20 2026 2:36 AM | Updated on Nov 20 2026 2:36 AM

వేములవాడరూరల్‌: విద్యార్థులకు సరైన మార్గదర్శనం అందిస్తే ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని జిల్లా విద్యాశాఖ ధికారి విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. వేములవాడరూరల్‌ మండలం మర్రిపల్లి కేజీబీవీలో గురువారం సైన్స్‌ఫెయిర్‌ నిర్వహించారు. సైన్స్‌ ఫెయిర్‌ను సందర్శించిన డీఈవో మాట్లాడుతూ ప్రతీ విద్యార్థిలోనూ అ పారమైన ప్రతిభ, సృజనాత్మకత, ఆలోచనాశక్తి దాగి ఉంటాయన్నారు. దాదాపు 330 మంది వి ద్యార్థినులు ప్రాజెక్టులు ప్రదర్శించారు. వేములవాడ సీడీపీవో సౌందర్య, ఉమారాణి, జిల్లా బా లల సంరక్షణ అధికారి కవిత, జీసీడీవో పద్మ, ఎంఈవో కిషన్‌, మర్రిపల్లి కేజీబీవీ ఎస్‌ వో పద్మ, ఎన్జీవో కోఆర్డినేటర్‌ ఆశ్రిత, లహరి, మ మత, హరిబాబు, ప్రశాంత్‌, లక్ష్మణ్‌ ఉన్నారు.

21న మండలస్థాయి

చెకుముకి టెస్ట్‌

సిరిసిల్ల అర్బన్‌: జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈనెల 21న మండలాల్లో చెకుముకి టాలెంట్‌ టెస్ట్‌ నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు పారం లక్ష్మీనారాయణ తెలిపారు. పాఠశాల స్థాయిలో 6వేల మంది పరీక్ష రాయగా, ఎంపికై న విద్యార్థులతో మండల స్థాయి పోటీలు నిర్వహించి నాలుగు టీమ్‌లను ఎంపిక చేయనున్నట్లు వివరించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ద్యావనపల్లి శ్రీహరి, గౌరవ అధ్యక్షుడు సిలివేరి సంపత్‌కుమార్‌, గుర్రం ఆంజనేయులు, గొర్రె రాజలింగం, రంజిత్‌ మహారాజ్‌, కన్నం గంగయ్య, వేణుగోపాల్‌ పాల్గొన్నారు.

విద్యుత్‌శాఖ

పనులపై సమీక్ష

సిరిసిల్లటౌన్‌: జిల్లాలో జరుగుతున్న విద్యుత్‌శాఖ పనులను చీఫ్‌ ఇంజినీర్‌ అశోక్‌ గురువా రం సమీక్షించారు. అశోక్‌ మాట్లాడుతూ పాడయిన విద్యుత్‌ నియంత్రికల మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలన్నారు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలుగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డీఈలు జి.వెంకటరమణ, అంజయ్య, ఏడీఈ రాజలింగం, ఏఈ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

రైతులు ఇబ్బందులు పడొద్దు

చందుర్తి: రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌ సూచించారు. మండలంలోని తిమ్మాపూర్‌లో సింగిల్‌విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని గురువారం పరిశీలించారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు అడిగి తెలుసుకున్నారు. సేకరించిన ధాన్యం వివరాలు ఎప్పటికప్పుడు రిజిస్టర్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. తహసీల్దార్‌ భూపతి, చందుర్తి సింగిల్‌విండో సీఈవో గసికంటి చిరంజీవి ఉన్నారు.

నామాపూర్‌లో యంగ్‌

ఇండియా స్కూల్‌

ముస్తాబాద్‌: మండలంలోని నామాపూర్‌లో ఏర్పాటు చేసే యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌కు స్థలాన్ని గురువారం అప్పగించారు. సర్వేనంబర్‌ 280లోని 20 ఎకరాల ప్రభుత్వ భూమిని అందజేసినట్లు సిరిసిల్ల కాంగ్రెస్‌ ఇన్‌చార్జి కె.కె.మహేందర్‌రెడ్డి తెలిపారు. రూ.200 కోట్లతో ఈ స్కూల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. పేద విద్యార్థులకు ఉన్నతమైన విద్యనందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఇరవై ఎకరాలకు సంబంధించిన పత్రాలను టీజీఈడబ్ల్యూఐసీ ఏఈ నాగరాజుకు సర్పంచ్‌ అనిల్‌, తహసీల్దార్‌ ఫారూక్‌, ఆర్‌ఐ ప్రవీణ్‌ అందించినట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement