డీఎంహెచ్వో ఏంజెలా ఆల్ఫ్రెడ్
సిరిసిల్ల: జిల్లాలోని హైరిస్క్ గర్భిణులను గుర్తించి, మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్ కోరారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆఫీస్లో గురువారం జరిగిన ఏఎన్ఎంల సమావేశంలో మాట్లాడారు. గర్భిణుల ఆరో గ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నా రు. అధిక రక్తపోటు, రక్తహీనత, మధుమేహం వంటి సమస్యలు ఉన్న వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నా రు. మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు సకాలంలో రిఫర్ చేయాలని సూచించారు. ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ నయీ మ్ జహా, ఎన్హెచ్ఎం డీపీవో ఉమా పాల్గొన్నారు.
సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి
తంగళ్లపల్లి: సిజేరియన్ ప్రసవాల సంఖ్యను తగ్గించి సాధారణ ప్రసవాలను ప్రోత్సహించేందుకు వైద్యులు, సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్ ఆదేశించారు. తంగళ్లపల్లి పీహెచ్సీని గురువారం తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని రికార్డులు, రోగులకు అందుతున్న సేవలు పరిశీలించారు. డీఎంహెచ్వో మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే సిజేరియ న్ చేయాలన్నారు. వైద్యాధికారి దీప్తి పాల్గొన్నారు.


