కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల: నిబంధనలకు అనుగుణంగా ఖరీఫ్ పంట దిగుబడులు కొనుగోళ్లు చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. కలెక్టరేట్‌లో గురువారం వరి ధాన్యం, పత్తి కొనుగోళ్లపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం రవాణా కోసం వాహనాలు సిద్ధంగా పెట్టాలని రవాణాశాఖ అధికారులకు సూచించారు. డీఆర్డీవో లక్ష్మీనారాయణ, డీఏవో అఫ్జల్‌బేగం, డీసీఎస్‌వో తనూజ, మేనేజర్ గోపాల్, డీటీవో డి.శ్రీనివాస్, డీసీవో రామకృష్ణ, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్ పాల్గొన్నారు.
భూముల రీసర్వే పూర్తి చేయాలి
భూముల రీసర్వే ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, రెవెన్యూ, అటవీశాఖ, ఇతర ప్రభుత్వ శాఖలు సంయుక్తంగా చేపట్టాలని సూచించారు. తప్పులు లేకుండా, పకడ్బందీగా సమాచారం సేకరించాలని సూచించారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రత్యేక కేంద్రాలను పరిశీలించాలన్నారు. డీఆర్వో జి.జయశ్రీ, ఆర్డీవోలు శ్రీధర్‌బాబు, కేఎస్‌బీ కుమారి, ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
వైద్యులు అందుబాటులో ఉండాలి
వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని, మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌నగర్ అర్బ న్ పీహెచ్‌సీని కలెక్టర్ తనిఖీ చేశారు. ఓపీ రిజిస్టర్, ల్యాబ్, వ్యాక్సిన్లు, ఇమ్యూనైజేషన్ గది, ఇన్ పేషెంట్ గదులు, ఫార్మసీని పరిశీలించారు. ఏఎన్సీ రి జి స్ట్రేషన్లు, గర్భిణీల ఆరోగ్య విషయాలపై దృష్టి సా రించి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంచేలా కృషి చేయాలని ఏఎన్‌ఎంలకు సూచించారు.
జాతీయస్థాయి ఏవియేషన్ ఒలింపియాడ్‌కు ఎంపిక
జాతీయస్థాయి ఏవియేషన్ ఒలింపియాడ్‌కు ఇద్దరు కేజీబీవీ విద్యార్థులు ఎంపికవగా.. కలెక్టర్ అభినందించారు. ఈ ఏడాది జాతీయస్థాయి ఏవియేషన్ ఒ లింపియాడ్‌లో 12,440లకు పైగా పాఠశాలల నుంచి 2,09,280 మంది విద్యార్థులు హాజరయ్యారు. జాతీయస్థాయి ఫైనల్ పోటీలకు దేశవ్యాప్తంగా 145 మంది అర్హత సాధించారు. రాష్ట్రం నుంచి ఐదుగురు ఎంపికవగా.. ఇద్దరు తంగళ్లపల్లి కేజీబీవీకి చెందిన అలూరి స్మిత(9వ తరగతి), తొంటి రితీష(10వ తరగతి) ఉన్నారు. డీఈవో విజయసాగర్, జీసీడీవో పద్మజ తదితరులు ఉన్నారు.


