29న దీక్షా దివస్‌ను
విజయవంతం చేయాలి
మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ ఎల్.రమణ
సిరిసిల్ల: తెలంగాణ కేసీఆర్ దీక్షతోనే సాధ్యమైందని మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ ఎల్.రమణ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో గురువారం బీఆర్‌ఎస్ శ్రేణులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. రమణ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమస్ఫూర్తి.. ఆనాటి సంగతులను గుర్తు చేసుకుంటూ.. దీక్షా దివస్‌ను బీఆర్‌ఎస్ నిర్వహిస్తుందని తెలిపారు. కరీంనగర్‌లో జరిగే ఈ సభకు భారీ సంఖ్యలో బీఆర్‌ఎస్ శ్రేణులు తరలిరావాలని కోరారు. నాఫ్స్‌కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ‘చలో కరీంనగర్–దీక్షా దివస్’ సభకు రావాలన్నారు. సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళాచక్రపాణి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమా, మున్సిపల్ వైస్‌చైర్మన్ దార్ల సందీప్, అర్బన్ బ్యాంకు చైర్మన్ రాపల్లి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.


