సంక్షేమం, అభివృద్ధి లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

సంక్షేమం, అభివృద్ధి లక్ష్యం

Nov 20 2026 2:36 AM | Updated on Nov 20 2026 2:36 AM

● టీఎస్‌ఆర్డీసీ చైర్మన్‌ మల్‌రెడ్డి రాంరెడ్డి

ఎల్లారెడ్డిపేట/ముస్తాబాద్‌: సంక్షేమం, అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(టీఎస్‌ఆర్డీసీ) చైర్మన్‌ మల్‌రెడ్డి రాంరెడ్డి పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్‌ మండల కేంద్రాల్లోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాల్లో గురువారం విలేకరులతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ హయాంలో కేసీఆర్‌ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో పేదలకు సన్నబియ్యం, రేషన్‌కార్డులు, ఉచిత విద్యుత్‌, ఉచిత బస్‌, రైతులకు రుణమాఫీ చేసిన వి షయాన్ని గుర్తు చేశారు. రోడ్ల అభివృద్ధికి ఇటీవల రూ.21వేల కోట్లు మంజూరు చేశామన్నారు. అబ ద్దాలు ప్రచారం చేస్తున్న కేసీఆర్‌, హరీశ్‌రావు, కేటీఆర్‌లకు ప్రజలు మరోసారి బుద్ది చెప్తారన్నారు. స్టేట్‌ కోఆపరేటీవ్‌ యూనియన్‌ చైర్మన్‌ మానాల మో హన్‌రెడ్డి, సిరిసిల్ల కాంగ్రెస్‌ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌లు మహేశ్‌రెడ్డి, మేడిపల్లి దేవా నందం, వైస్‌చైర్మన్‌ నంది కిషన్‌, సర్పంచుల ఫోరం ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, పార్టీ మండలాల అధ్యక్షులు గజ్జెల రా జు, సూడిది రాజేందర్‌, నాయకులు బాల్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ విజయ్‌రెడ్డి, బండారి బాల్‌రెడ్డి, గుండాడి రాంరెడ్డి, భాను, బాబు, కరుణాకర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement