మంథని: మంథని పట్టణానికి చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ తూర్పాటి సత్యనారాయణకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. ఫ్రాన్స్, ఇటలీ, మొనాకో దేశాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక రామోగే ఫొటో కాంటెస్ట్–2026 (ది మ్యాన్ అండ్ ది సీ) పోటీలో ఆయన ఫొటోకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి వేలాది మంది ఫొటోగ్రాఫర్లు పంపిన చిత్రాల్లో సత్యనారాయణ ఫొటో అంతర్జాతీయ జ్యూరీ సభ్యుల ప్రశంసలు అందుకుంది. సముద్రంతో మనిషికి ఉన్న అనుబంధాన్ని, గిరిజన మహిళ జీవన విధానాన్ని తన కెమెరాలో సహజంగా ఆవిష్కరించడం విశేషం. ఈ పోటీ అవార్డుల ప్రధానోత్సవం డిసెంబర్ 4న మొనాకోలోని ఓషనోగ్రాఫిక్ మ్యూజియంలో నిర్వహించనున్నారు. మంథని వంటి చిన్న పట్టణం నుంచి అంతర్జాతీయ వేదికపై గుర్తింపు రావడం ఎంతో ఆనందంగా ఉందని సత్యనారాయణ పేర్కొన్నారు.


