తెల్లవారకముందే జిల్లా ప్రజలు తమ బతుకుబండిని లాగేందుకు సిద్ధమవుతున్నారు. చలిని సైతం లెక్కచేయకుండా జీవనపోరాటం చేస్తున్నారు. రోడ్లను పొగమంచు కమ్మేస్తున్నా రైతులు తాము పండించిన కూరగాయలు విక్రయించేందుకు రైతుబజార్‌కు వస్తుండగా.. గ్రామాల్లో తిరిగి విక్రయించే చిరువ్యాపారులు తమ వాహనాల్లో రైతుబజార్ నుంచి పల్లెబాట పడుతున్నారు. రైతుబజార్లో విక్రయించే వ్యాపారులు చలిని తట్టుకునేందుకు టీని ఆశ్రయిస్తుండగా.. పారిశుధ్య కార్మికులు పట్టణాన్ని పరిశుభ్రం చేసే పనిలో నిమగ్నమయ్యారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, రాజన్నసిరిసిల్ల


