సిరిసిల్ల: డిఫాల్ట్ లేని ‘రా’, బాయిల్ రైస్‌మిల్లర్లు బ్యాంకు గ్యారంటీ ఇస్తేనే ఖరీఫ్ సీజన్ ధాన్యం కేటాయిస్తామని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ స్పష్టం చేశారు. కలెక్టరేట్లో బుధవారం పౌరసరఫరాల అధికారులతో కలిసి రైస్మిల్లర్లుతో సమీక్షించారు. నగేశ్ మాట్లాడుతూ యాసంగి 2024–2025 సీజన్‌కు సంబంధించిన బకాయిలు ఉన్న మిల్లర్లు ఈనెల 30 వరకు సీఎమ్మార్ ఇవ్వాలన్నారు. ఖరీఫ్ 2026–2027 సీజన్‌కు సంబంధించిన ధాన్యాన్ని డిఫాల్ట్ లేని రైస్‌మిల్లర్లకు బ్యాంకు గ్యారంటీ ఇస్తే కేటాయిస్తామని తెలిపారు. డీసీఎస్వో జి.తనూజ, పౌరసరఫరాల శాఖ డీఎం గోపాల్, డీటీసీఎస్‌లు రజిత, బి.సత్యనారాయణ, రైస్‌మిల్లర్ల ప్రతినిధులు చేపూరి నాగరాజు, పబ్బ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
రైతులు ధాన్యం శుభ్రం చేసి సిద్ధం చేయాలి
ధాన్యం కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ తెలిపారు. ధాన్యం సేకరణకు జిల్లాలో ఇప్పటి వరకు ఐకేపీ ఆధ్వర్యంలో 113, పీఏసీఎస్ పరిధిలో 108, మెప్మా ఆధ్వర్యంలో ఆరు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు తెలిపారు. ధాన్యం సేకరణ కోసం ఇప్పటికే 26 రైస్‌మిల్లులు, ప్రభుత్వ ప్రత్యామ్నాయ గోదాములు సిద్ధంగా పెట్టామన్నారు. రైతులు శుభ్రం చేసిన ధాన్యంలో 17 శాతం తేమ ఉండేలా చూసుకోవాలన్నారు.


