బోయినపల్లి: సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. మండలంలోని కొత్తపేటలో 567 పింఛన్ మంజూరు పత్రాలను కలెక్టర్ గరీమ అగ్రవాల్‌తో కలిసి బుధవారం పంపిణీ చేశారు. కలెక్టర్ గరీమా అగ్రవాల్ మాట్లాడుతూ పింఛన్‌కు అర్హులు ఉంటే మండల పరిషత్‌లలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మండల ప్రత్యేకాధికారి శ రత్‌బాబు, తహసీల్దార్ షరీఫ్ మొహియొద్దీన్, ప్యాక్స్ చైర్మన్లు వెంకట్రామారావు, దుర్గారెడ్డి, సెస్ డైరెక్టర్ సుధాకర్, కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షుడు కూస రవీందర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సువీన్‌యాదవ్, మహేశ్‌రెడ్డి, సర్పంచ్ ఇల్లందుల రాజు ఉన్నారు.
సిరిసిల్ల అర్బన్: మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు చిన్నబోనాలలో అర్హులందరికీ పెన్షన్‌లు మంజూరుకాలేవని స్థానికులు, కౌన్సిలర్ బొల్గం వైష్ణవి బుధవారం నిరసన తెలిపారు. కౌన్సిలర్ వైష్ణవి మాట్లాడుతూ దరఖాస్తు చేసుకున్న 39 మందిలో 27 మందికే ప్రొసీడింగ్స్ అందాయని, మిగిలిన 12 మందికి అందలేదన్నారు. అర్హులందరికీ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
కోనరావుపేట: ఈఎంఆర్‌ఎస్ ఇందల్‌వాయిలో నిర్వహించిన ‘క్లస్టర్ స్థాయి సాంస్కృతిక, సా హిత్య ఉత్సవాలు–2026’లో మరిమడ్ల విద్యార్థులు ఓవరాల్ చాంపియన్‌గా నిలిచారు. బి.ప్రజన్– శాసీ్త్రయనృత్యం, సాంప్రదాయ కథలు చెప్పడంలో జి.జశ్వంత్, బి.పుష్పలత, ఉపన్యాస పోటీల్లో ఎల్.సెమ్యూల్‌నాయక్, ఎం.రాహుల్‌నాయక్, త్రీడీ శిల్పకళలో జె.హర్షిత్ ప్రథమ బహుమతులు సాధించారు. సృజనా త్మక రచనలో వి.విఠల్‌నాయక్, గిరిజన వా యిద్య సంగీతంలో ఇ.రోహిత్, ఎ.జ్వితేష్, ఎన్.అఖిల్‌నాయక్, వాయిద్య సంగీతంలో బి.జశ్వంత్, చర్చపోటీలో ఎం.రాహుల్‌నాయ క్, డి.హర్షిత్ ద్వితీయ బహుమతులు సాధించారు. వీరిని ప్రిన్సిపాల్ రామ్‌సూరత్‌యాదవ్, ఫిజికల్ డైరెక్టర్ సుధాకర్ అభినందించారు.
ముస్తాబాద్/తంగళ్లపల్లి: నిబంధనల మేరకు ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ కోరారు. ముస్తాబాద్ మండలం నామాపూర్, తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల, అంకుసాపూర్ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను బుధవారం పరిశీలించారు. నిర్ధేశించిన తేమ శాతం వచ్చిన తర్వాత తూకం వేయాలని సూచించారు. తంగళ్లపల్లి మండలం వేణుగోపాలపూర్‌లో కొనసాగుతున్న భూముల రీసర్వేను పరిశీలించారు. సర్వే వివరాలు తెలుసుకున్నారు. ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాస్, తహసీల్దార్‌లు మురళీకృష్ణ, ఫారుక్, ఆర్‌ఐ ప్రవీన్, సీసీ శోభన్‌బాబు, సర్పంచ్ అంచ శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.
మోడల్ స్కూళ్లలో 28 పోస్టులు భర్తీ
గంభీరావుపేట: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు సాంకేతిక, సృజనాత్మక విద్యనందించేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మోడల్ స్కూళ్లలో యోగా, ఆర్ట్, కంప్యూటర్ ఉపాధ్యాయులతోపాటు లైబ్రేరియన్ పోస్టులను ఔట్‌సోర్సింగ్‌లో భర్తీ చేయనున్నారు. ఐదు నెలలపాటు కొనసాగనున్న ఈ నియామకాలతో మోడల్ స్కూళ్లలో బోధనకు అదనపు బలం చేకూరనుంది. జిల్లాలోని ఏడు మోడల్ స్కూళ్లలో 28 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైన వారు వచ్చే ఏడాది మార్చి వరకు విధులు నిర్వహించనున్నారు. అభ్యర్థుల వయస్సు 21 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. రోస్టర్ పద్ధతి, రిజర్వేషన్లు, ప్రభుత్వం నిర్ధేశించిన విద్యార్హతలను పాటిస్తూ పారదర్శకంగా ఎంపిక చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణ తేదీని జిల్లా అధికారులు ప్రకటించాల్సి ఉంది.


