పేద కుటుంబాలకు ఇందిరమ్మ బీమా భరోసా | - | Sakshi
Sakshi News home page

పేద కుటుంబాలకు ఇందిరమ్మ బీమా భరోసా

Nov 17 2026 11:56 PM | Updated on Nov 17 2026 11:56 PM

● ఈ నెల 19 నుంచి పథకం నమోదు ప్రారంభం ● ప్రీమియం భారం లేకుండా రూ.5 లక్షల బీమా రక్షణ

● ఈ నెల 19 నుంచి పథకం నమోదు ప్రారంభం ● ప్రీమియం భారం లేకుండా రూ.5 లక్షల బీమా రక్షణ

తంగళ్లపల్లి: కుటుంబానికి ఆధారమైన సంపాదించే వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులపాలు కాకుండా అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని’ అమలు చేయనుంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 19 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తూ రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించనుంది.

జిల్లాలో 1.91 లక్షల కుటుంబాలకు లబ్ధి

జిల్లాలోని 345 రేషన్‌ దుకాణాల పరిధిలో 1,91,163 ఆహార భద్రతా కార్డులు ఉండగా, వాటి పరిధిలో 5.63 లక్షల మందికిపైగా లబ్ధిదారులు ఉన్నారు. కొత్త స్మార్ట్‌ రేషన్‌ కార్డులతో కలిపి సుమారు 1.91 లక్షల కుటుంబాలకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరనుంది. రేషన్‌ కార్డులు లేని అర్హులైన కుటుంబాలకూ పథకాన్ని వర్తింపజేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

గ్రామాల్లోనే దరఖాస్తుల స్వీకరణ

ప్రజలకు ఇబ్బందులు లేకుండా గ్రామస్థాయిలోనే నమోదు ప్రక్రియ చేపట్టనున్నారు. 19 నుంచి గ్రామ పంచాయతీలు లేదా ప్రత్యేక కేంద్రాల్లో అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తు సమయంలో బీమా పొందే వ్యక్తి, నామినీల ఆధార్‌కార్డులు, రేషన్‌ లేదా స్మార్ట్‌ రేషన్‌ కార్డు, ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్‌ నంబర్‌, కుటుంబ సభ్యుల వివరాలు సమర్పించాలి.

అర్హతలు.. నిబంధనలు

కుటుంబంలో సంపాదించే వ్యక్తి వయస్సు 18– 59 ఏళ్ల మధ్య ఉండాలి. ఆధార్‌ కార్డులో పుట్టిన తేదీ ఆధారంగా అర్హతను నిర్ణయిస్తారు. కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది సంపాదిస్తుంటే భర్త లేదా భార్యలో ఎవరి పేరు మీద బీమా తీసుకోవాలనేది కుటుంబ సభ్యులు నిర్ణయించుకోవచ్చు. ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మందిని నామినీలుగా పేర్కొనవచ్చు. పరిహారంలో ఎవరికి ఎంత వాటా ఇవ్వాలనేది దరఖాస్తులో స్పష్టంగా నమోదు చేయాలి. నామినీ మైనర్‌ అయితే సంరక్షకుడి వివరాలు ఇవ్వాలి. దరఖాస్తులో నమోదు చేసిన పేరు, వయస్సు, నామినీ వాటాలను పరిశీలించిన తర్వాతే సంతకం లేదా వేలిముద్ర వేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement