రుద్రంగి: సిద్దిపేటలో ఈ నెల 19న నిర్వహించే సీఎం బహిరంగ సభ విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ శ్రేణులు సమన్వయంతో పనిచేస్తూ సభకు పెద్ద ఎత్తున ప్రజలు, పార్టీ నాయకులు హాజరయ్యేలా కృషి చేయాలని సూచించారు. మంగళవారం మండల కేంద్రంలో సభ సిరిసిల్ల నియోజకవర్గ బాధ్యులు మల్‌రెడ్డి రామిరెడ్డి, మానాల మోహన్‌రెడ్డి, ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డితో కలిసి సన్నాహక సమావేశం నిర్వహించారు. గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ప్రతి నాయకుడు, కార్యకర్త సభ విజయవంతానికి బాధ్యతగా పనిచేయాలని సూచించారు. సమష్టి కృషితో సభకు సంబంధించిన ఏర్పాట్లలో భాగస్వాములు కావాల ని, ప్రజాపాలనలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించే వేదికగా ఈ సభ నిలవనుందని పేర్కొన్నారు. సమావేశంలో నాయకులు పాల్గొన్నారు.
నిరుపేదల సంక్షేమమే లక్ష్యం
ఎల్లారెడ్డిపేట: నిరుపేదల సంక్షేమమే లక్ష్యం అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధి కారి లక్ష్మీనారాయణ, ఏఎంసీ చైర్మన్ మేడిపల్లి దేవానందం అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో వివిధ గ్రామాలకు చెందిన 563 మందికి చేయూత పింఛన్లు, 67 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పత్రాలు పంపిణీ చేశారు. ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన పింఛన్లతో పేదలకు ఎంతో లబ్ధి చేకూరుతుందన్నారు. తహసీల్దార్ దివ్యజ్యోతి, ఎంపీడీవో సత్తయ్య, విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, సర్పంచ్‌ల ఫోరం మండల కన్వీనర్ దొమ్మాటి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
దీక్షా దివస్ విజయవంతం చేయాలి
సిరిసిల్ల: కరీంనగర్ జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్ నిర్వహించ తలపెట్టిన దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్సీ ఎనగందుల రమణ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తిని నేటి తరానికి వివరించేందుకు దీక్షా దివస్ నిర్వహించనున్నట్లు వివరించారు. నాప్స్‌కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు మాట్లాడుతూ, దీక్షా దివస్‌కు సిరిసిల్ల ప్రాంతంలోని ప్రతి ఊరు నుంచి బీఆర్‌ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలన్నారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ఉమ్మడి జిల్లా జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ తుల ఉమా, గూడూరి ప్రవీణ్, న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, జిందం చక్రపాణి, బొల్లి రామ్మోహన్, వివిధ మండలాల అధ్యక్షులు గుజ్జుల రాజిరెడ్డి, పాపగారి వెంకట్‌స్వామిగౌడ్, బొంపల్లి సురేందర్‌రావు, గజబింకార్ రాజన్న, వరస కృష్ణహరి తదితరులు పాల్గొన్నారు.


