ఎస్పీ మహేశ్ బీ గీతే
సిరిసిల్ల: విద్యార్థులు సైబర్ నేరాలపై అప్రమత్తంగా, ర్యాగింగ్, గంజాయి, డ్రగ్స్ వంటి చెడు వ్యసనా లకు దూరంగా ఉంటూ ఉత్తమ వైద్యులుగా ఎదగా లని ఎస్పీ మహేశ్ బీ గీతే కోరారు. మంగళవారం సి రిసిల్ల మెడికల్ కాలేజీలో నిర్వహించిన సదస్సులో మాట్లాడారు. ఎవరికై నా ఆన్‌లైన్ వేధింపులు ఎదురైతే భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసుల దృష్టికి తీసుకురావాలన్నా రు. కళాశాల ఆవరణలో అందరూ స్నేహపూర్వక వాతావరణంలో విద్యను అభ్యసించాలని, మత్తు పదార్థాల జోలికి వెళ్లవద్దన్నారు. ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థినుల భద్రత కోసం జిల్లా షీ టీం పకడ్బందీగా పనిచేస్తుందని, ఎలాంటి వేధింపులు ఎదురైనా వెంటనే షీ టీం నంబర్ 87126 56425 కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రిన్సిపాల్ రాజేశ్వరి, సీఐ శ్రీనివాస్, అధ్యాపకులు, సైబర్ ఆర్‌ఎస్‌ఐ జునైద్ పాల్గొన్నారు.


