ఓపెన్‌.. నిర్లక్ష్యం! | - | Sakshi
Sakshi News home page

ఓపెన్‌.. నిర్లక్ష్యం!

Nov 12 2026 12:31 AM | Updated on Nov 12 2026 12:31 AM

ఓపెన్‌.. నిర్లక్ష్యం!

తుప్పు.. ఎవరిది తప్పు?

తుప్పుపడుతున్న ఓపెన్‌ జిమ్‌లు

వ్యాయామం చేస్తే గాయాలు ఖాయం

పలుచోట్ల పరికరాలు విరిగి పనికి రాకుండా మారిన వైనం

నీరుగారుతున్న ఆరోగ్య సిరిసిల్ల లక్ష్యం

నిర్వహణ లోపంపై సర్వత్రా విమర్శలు

సిరిసిల్ల టౌన్‌: సిరిసిల్లలో మున్సిపల్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓపెన్‌ జిమ్‌లు నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారాయి. పట్టణవాసుల ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసిన వ్యాయామ పరికరాలు నిర్వహణ లేక తుప్పుపట్టి పోతున్నాయి. ఎప్పుడు విరిగిపోతా యో తెలియక వ్యాయామం చేసేవారికి ఇబ్బందికరంగా తయారయ్యాయి. పట్టించుకోవాల్సిన బల్ది యా నిర్లక్ష్యం వహిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తొమ్మిదేళ్ల క్రితం సిరిసిల్లలో డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌(సీడీఎంఏ) ఆధ్వర్యంలో ‘వరల్డ్‌బ్యాంకు’ ప్రాజెక్టు ద్వారా స్మార్ట్‌ ఓపెన్‌జిమ్‌లు ఏర్పాటు చేశారు. స్థానిక ఇందిరాపార్కు, శాంతినగర్‌, గణేశ్‌నగర్‌లో ఒక్కోటి రూ.15లక్షలు వెచ్చించి రూ.45లక్షలతో సిద్ధం చేశారు. ఈ స్మార్ట్‌ ఓపెన్‌, ఔట్‌డోర్‌ జిమ్‌లను పట్టణం నలువైపులా పార్కుల్లో ఏర్పాటు చేయగా ప్రజలు ఉదయం, సాయంత్రం వేళల్లో వినియోగించుకునేవారు. విలీన గ్రామాలను కూడా కలుపుకుని మొత్తంగా 23చోట్లలో ఓపెన్‌ జిమ్‌లు ఉన్నాయి. కొన్ని నెలలుగా వీటి పర్యవేక్షణ లోపంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

నిధులు కోట్లు.. నిర్వహణకు తూట్లు

రూ.కోట్లు వెచ్చించి ఏర్పాటు చేసిన స్మార్ట్‌జిమ్‌ల నిర్వహణ లోపంతో ఆరోగ్య సిరిసిల్ల లక్ష్యానికి అధికారులు తూట్లు పొడుస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. స్మార్ట్‌ సిరిసిల్లలో ప్రజారోగ్యం కోసం రూ.1.75కోట్లు ఖర్చు చేశారు. గడిచిన మూడేళ్ల నుంచి బల్దియా జిమ్‌ల నిర్వహణపై శ్రద్ధ చూపకపోవడంతో పరికరాలు విరిగి, ఫ్లోరింగ్‌ పెచ్చులూడుతోంది. నిత్యం వాకింగ్‌, వ్యాయామానికి వచ్చేవారు పరిస్థితిని అధికారులు, పాలకుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని చెబుతున్నారు. ఇప్పటికై నా జిమ్‌ల నిర్వహణపై శ్రద్ధ పెట్టాలని సిరిసిల్ల పట్టణ ప్రజలు కోరుతున్నారు.

మున్సిపల్‌ ఆధ్వర్యంలో 39వార్డుల పరిధిలో ఏర్పాటుచేసిన 23 ఓపెన్‌ జిమ్‌లు ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ పాడైపోయాయి. మూడు నెలలకోసారి పరికరాలను రిపేరు చేయించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. టీడీఎంఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్మార్ట్‌జిమ్‌లు పోగా.. మున్సిపల్‌ ఆధ్వర్యంలో జూనియర్‌ కళాశాల మైదానం, రగుడు, శాంతినగర్‌, నెహ్రూనగర్‌, కార్గిల్‌లేక్‌, పెద్దూరు, చిన్నబోనాల, రాజీవ్‌నగర్‌, పెద్దబోనాల, జేపీనగర్‌ పార్కు, పద్మనగర్‌, బీ.వై.నగర్‌, సుందరయ్యనగర్‌, వెంకంపేట, సుందరయ్యనగర్‌, నర్సింగ్‌ కళాశాల ప్రాంతం, నెహ్రూపార్కు, డబుల్‌బెడ్రూం కాంప్లెక్స్‌, వెంకట్రావునగర్‌ పార్కు, సాయినగర్‌ ప్రాంతాల్లో ఉన్న ఓపెన్‌జిమ్‌ల నిర్వహణ లోపంతో కొన్నిచోట్లలో పరికరాలు తుప్పు పడుతున్నాయి.

శాంతినగర్‌లోని స్మార్ట్‌ ఓపెన్‌ జిమ్‌ ఇది. రూ.15లక్షలతో ఎనిమిదేళ్ల క్రితం ఏర్పాటు చేశారు. ఏడాది కాలంగా ఈ పరికరాల నిర్వహణను మున్సిపల్‌ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఫలితంగా పరికరాల విడిభాగాలు పనికిరాకుండా మారాయి. వాకర్స్‌, వ్యాయామం చేసే వారికి ఇబ్బందిగా తయారైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement