వేములవాడను టెంపుల్ సిటీగా మార్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు శృంగేరి పీఠాధిపతుల సూచనలు, సలహాల మేరకే చేపడుతున్నాం. ఆగమశాస్త్రం ప్రకారం, భక్తులు, స్థానికుల మనోభావాలకు అనుగుణంగా పనులు సాగుతున్నాయి. అభివృద్ధి పనులకు సహకరిస్తున్న నిర్వాసితుల త్యాగాలు మరవలేనివి. రూ.99.40కోట్లతో టెండర్ పూర్తయ్యింది. త్వరలోనే వీటీడీఏ చైర్మన్, సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశం ఉంటుంది. వీలైనంత త్వరగా భక్తుల దర్శనాలకు అనుమతి ఇస్తాం. – ఆది శ్రీనివాస్,
ప్రభుత్వవిప్, వేములవాడ ఎమ్మెల్యే


