దివ్యాంగులపై శ్రద్ధ చూపాలి | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగులపై శ్రద్ధ చూపాలి

Nov 12 2026 12:31 AM | Updated on Nov 12 2026 12:31 AM

కోనరావుపేట: మానసిక దివ్యాంగులైన పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ ఆల్ప్రెడ్‌ ఏంజెలా సూచించారు. కోనరావుపేట ఉన్నత పాఠశాలలో మానసిక వైకల్యం ఉన్న విద్యార్థులకు ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని సందర్శించారు. మానసిక, వినికిడి, మూగ లోపం ఉన్నవారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి మందులు అందించారు. మానసిక దివ్యాంగులకు డాక్టర్‌ అనూష, చిన్నపిల్లలకు డాక్టర్‌ వెంకటరమణ వైద్య పరీక్షలు నిర్వహించారు. సర్పంచ్‌ మస్కూరి కాశీరాం, ఎంపీడీవో స్నిగ్ధ, ప్రోగ్రాం అధికారులు రామకృష్ణ, సంపత్‌ కుమార్‌, వైద్యాధికారి సురేశ్‌కుమార్‌, ఎంఈవో మురళీనాయక్‌ పాల్గొన్నారు.

చదువుతో ఉన్నత శిఖరాలు

సిరిసిల్ల అర్బన్‌: చదువుతోనే ఉన్నత శిఖరా లకు చేరుకోవచ్చని కలెక్టర్‌ గరిమా అగ్రవాల్‌ సూచించారు. పెద్దూరు ప్రభుత్వ పాఠశాలలో స్మార్ట్‌క్లాస్‌ రూమ్‌ను బుధవారం ప్రారంభించారు. మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జ యంతి, జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా జిల్లాలోని 20 పాఠశాలల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఆధ్వర్యంలో కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ కింద(సీఎస్‌ఆర్‌) నిధులు రూ.కోటితో స్మార్ట్‌క్లాస్‌ రూంలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగానే పెద్దూరులో స్మార్ట్‌ క్లాస్‌రూం ప్రారంభించామన్నారు. డీఈవో విజయ్‌సాగర్‌, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ రాజీవ్‌కుమార్‌, ఎంఈవో దూస రఘుపతి, ప్రధానోపాధ్యాయురాలు చక్రవర్తుల రమాదేవి, కౌన్సిలర్లు లింగంపల్లి భాగ్యలక్ష్మి, దొంతినేని కల్యాణి పాల్గొన్నారు.

నకిలీ లోన్‌యాప్‌లతో అప్రమత్తంగా ఉండాలి

సిరిసిల్ల: జిల్లా ప్రజ లు నకిలీ లోన్‌ యాప్‌ల ఉచ్చులో పడొద్దని పోలీసులు బుధవారం ‘సోషల్‌ మీడియా’లో ప్రచా రం చేపట్టారు. ప్రత్యేకమైన పోస్టర్‌ రూపొందించి ప్ర చారం చేస్తున్నారు. ‘నకిలీ లోన్‌ యాప్స్‌ విషయంలో అప్రమత్తంగా ఉండండి.. సైబర్‌ మోసాల బారిన పడకండి. తక్కువ వడ్డీతో తక్షణ రుణాలంటూ వచ్చే గుర్తుతెలియని యాప్‌లను నమ్మవద్దు. లోన్‌ కోసం ముందస్తు ఫీజులు చెల్లించవద్దు. బ్యాంక్‌ వివరాలు, ఓటీపీ వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ చెప్పొద్దు. ఆర్‌బీఐ గుర్తింపు పొందిన సంస్థల నుంచే రుణాలు పొందండి. సైబర్‌ మోసానికి గురైతే 1930కు కాల్‌ చేయండి‘ అంటూ ప్రచారం చేస్తున్నారు.

పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి

వేములవాడ/వేములవాడరూరల్‌: వేములవాడలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని మున్సిపల్‌ చైర్మన్‌ పుల్కం రాజు పేర్కొన్నారు. ‘పుణ్యక్షేత్రం... పారిశుధ్య లోపం’ శీర్షికతో ఈనెల 11న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి స్పందించారు. బుధవారం సమావేశ మందిరంలో కమిషనర్‌ లోకేష్‌, సానిటరీ ఇన్‌స్పెక్టర్‌, వార్డు అధికారులు, జవాన్లతో పట్టణ పారిశుధ్యంపై సమీక్షించారు. వేములవాడను పరిశుభ్రమైన పట్టణంగా తీర్చిదిద్దుతామని, పారిశుధ్య నిర్వహణను మెరుగు పరుస్తామన్నారు. ఇందుకోసం అధికారులు, సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. ప్రతీవార్డులో చెత్తసేకరణ సక్రమంగా జరిగేలా చూడాలని, రోడ్లు, మురికి కాలువలు, బహిరంగ ప్రదేశాల్లో అపరిశుభ్రత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు తడి, పొడి చెత్తను వేరు చేసి స్వచ్ఛ ఆటోలకు ఇవ్వాలని సూచించారు.

మినీ జాబ్‌మేళాకు స్పందన

సిరిసిల్ల: కలెక్టరేట్‌లోని ఎంప్లాయీమెంట్‌ ఆఫీస్‌లో బుధవారం నిర్వహించిన మినీ జాబ్‌మేళాకు స్పందన లభించింది. జిల్లాలోని ప్రముఖ ప్రైవేటు సంస్థలో నిరుద్యోగ యువతులకు ఉద్యోగ అవకాశం కల్పించేందుకు జా బ్‌మేళా నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 48 మంది హాజరయ్యారని జిల్లా ఉపాధి కల్పన అధికారిణి బి.నిర్మల తెలిపారు. పదోతరగతి, ఇంటర్‌, ఐటీఐ, డిప్లొ మా నాన్‌ టెక్నికల్‌, ఏదైనా డిగ్రీ చేసి ఎంపికై న అభ్యర్థులకు నెలకు రూ.17,000 వేతనం, వసతి, రవాణా సదుపాయాలు కల్పిస్తారని, ఎంపికైనవారి వివరాలను కంపెనీ ప్రతినిధులు తరువాత వెల్లడిస్తారని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement