కరువు మండలాల్లో సహాయక చర్యలు చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

కరువు మండలాల్లో సహాయక చర్యలు చేపట్టాలి

Nov 4 2026 11:46 PM | Updated on Nov 4 2026 11:46 PM

● సీపీఐ జాతీయ నాయకుడు చాడ వెంకటరెడ్డి

● సీపీఐ జాతీయ నాయకుడు చాడ వెంకటరెడ్డి

ఇల్లంతకుంట: కరువు మండలాల్లో ప్రభుత్వం సహా యక చర్యలు చేపట్టాలని సీపీఐ జాతీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి కోరారు. కరువు మండలంగా ప్రకటించిన ఇల్లంతకుంట లోని కందికట్కూర్‌లో ఎండిన పొలాలను బుధవా రం పరిశీలించారు. మెట్టప్రాంతమైన జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం సర్వే బృందాలను పంపి విచారణ చేపట్టి జాతీయ విపత్తుగా గుర్తించాలని కోరారు. ఎండిన వరి పొలాలకు రూ.30వేలు నష్టపరిహారం చెల్లించాలని, పత్తి పంటకు రూ.50వేలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి మంద సుదర్శన్‌, జిల్లా కార్యవర్గసభ్యులు కడారి రాములు, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, మండల కార్యదర్శి తీపిరెడ్డి తిరుపతిరెడ్డి, మంద అనిల్‌ పాల్గొన్నారు.

సరిహద్దు సమస్య పరిష్కరించాలి

ఇల్లంతకుంట మండలంలోని వెంకట్రావుపల్లి, గొల్లపల్లి గ్రామపంచాయతీల మధ్య 2018లో ఏర్పడ్డ సరిహద్దు సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ విషయంపై వెంకట్రావుపల్లి సర్పంచ్‌ చల్ల నవీన్‌కుమార్‌, మంద అనిల్‌, యాదగిరి తదితరులు వినతిపత్రం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement