సమస్యలు పరిష్కరించండి | - | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించండి

Nov 4 2026 11:46 PM | Updated on Nov 4 2026 11:46 PM

● సీఐటీయూ జిల్లా కార్యదర్శి రమణ

● సీఐటీయూ జిల్లా కార్యదర్శి రమణ

సిరిసిల్లటౌన్‌: మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని బీవై నగర్‌ కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. సిరిసిల్ల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్న మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఇప్పటికే అక్టోబర్‌ 29న మున్సిపల్‌ కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చామని.. అయినా స్పందన లేదన్నారు. గురువారం నుంచి విధులు బహిష్కరించి, సమ్మెకు వెళ్తున్నట్లు ప్రకటించారు. యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు కాసారపు శంకర్‌, నర్మెట బాబా, కిషన్‌, బత్తుల దేవరాజు, మారుపాక లక్ష్మి, బడుగు శ్రీనివాస్‌, అర్జున్‌, మల్లేశం, దేవవ్వ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement