రాజన్న సేవలో మహాలింగావరణము | - | Sakshi
Sakshi News home page

రాజన్న సేవలో మహాలింగావరణము

Nov 4 2026 11:46 PM | Updated on Nov 4 2026 11:46 PM

బిల్వప్రియుడికి నాంపల్లి పరిధిలో ప్రత్యేక తోట

బాలానగర్‌లో పూలతోట

ఆలయం ఆధ్వర్యంలో నిర్వహణ

వేములవాడఅర్బన్‌: దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడలో శ్రీరాజరాజేశ్వరస్వామి పూజలో వాడే పూలు, పత్రాల కోసం ప్రత్యేక తోటను పెంచుతున్నారు. ఇక్కడి నుంచే వచ్చే పూలు, పత్రాలను స్వామి వారి పూజలో వినియోగిస్తుంటారు. భక్తులు సమర్పించే కోడెలు, కోడెమొక్కులు చెల్లించేందుకు కోడెల పెంపకానికి ప్రత్యేక గోశాలలు, పూలు, పత్రాల కోసం మహాబిల్వం తోటను ఆలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.

మహాలింగావరణంలో మొక్కలు

వేములవాడ మున్సిపల్‌ పరిధిలోని నాంపల్లి శివారులోని గురువయ్యనగర్‌ కాలనీ సమీపంలో రాజన్న ఆలయానికి చెందిన ఐదు ఎకరాల విస్తీర్ణంలో మహాబిల్వం మొక్కలు నాటారు. వీటితోపాటు పూలు, పండ్ల చెట్లనూ పెంచుతున్నారు. కానీ సంరక్షణ సక్రమంగా లేక పూల చెట్లు ఎండిపోయాయి. స్వామివారి పూజకు ప్రత్యేకమైన మహాబిల్వం చెట్టు కొమ్మలోని రెమ్మలకు తొమ్మిది ఆకులు ఉంటాయి. లింగాకారంలో మహాబిల్వం మొక్కలు నా టినప్పటి కీ అవి కొన్ని ఎండిపోయాయి. మళ్లీ వాటి స్థానంలో కొత్తవి నాటేందుకు అధికారులు ప్రణాళికలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రత్యేకమైన మ హాలింగావరణంలో సిబ్బందిని కేటాయించి, మరి న్ని మహాబిల్వం మొక్కలు, పూలు, పండ్ల మొక్కలు నాటి, సంరక్షించాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు.

బాలానగర్‌లో ప్రత్యేక పూలతోట

వేములవాడ మున్సిపల్‌ పరిధిలోని బాలానగర్‌లోని ఆలయానికి సంబంధించిన రెండు ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేక పూలతోట పెంచుతున్నారు. తోటలోని పూలుగన్నేరు, మల్లె, గులాబీ పూలను స్వామివారికి ఉదయం, సాయంత్రం జరిగే పూజ లకు వినియోగిస్తారు. ఈ తోటలో స్వామివారికి ప్రీ తిపాత్రమైన బిల్వపత్రి మొక్కలు సైతం ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement