అటవీ భూముల రక్షణకు సిట్‌ | - | Sakshi
Sakshi News home page

అటవీ భూముల రక్షణకు సిట్‌

Nov 4 2026 11:46 PM | Updated on Nov 4 2026 11:46 PM

● అడవుల్లో చెరువుల నిర్మాణం ● కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌

● అడవుల్లో చెరువుల నిర్మాణం ● కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌

సిరిసిల్ల: అటవీ భూముల రక్షణకు స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌(సిట్‌)ను నియమిస్తామని, ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ ఆదేశించారు. అటవీ భూముల రక్షణ, నీటివనరుల అభివృద్ధిపై కలెక్టరేట్‌లో బుధవారం ఎస్పీ మహేశ్‌ బీ గీతే, అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌, డీఎఫ్‌వో సత్యనారాయణతో కలిసి సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ అటవీ భూములు, ప్రభుత్వ భూముల రికార్డులు పరిశీలించాలని, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను గుర్తించాలన్నారు. రెవెన్యూ, ఫారెస్ట్‌ అధికారులు సంయుక్తంగా సరిహద్దులను నిర్ణయించాలని ఆదేశించారు. వన్యప్రాణుల సంరక్షణకు ప్రాధాన్యతనివ్వాలని, జంతువులను వేటాడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. భూగర్భ జలాల పెంపునకు నీటికుంటలు, చెరువులు నిర్మించాలన్నారు. జిల్లాలో గుర్తించిన 157 వెట్‌ ల్యాండ్స్‌ హద్దులు, విస్తీర్ణం, ఎఫ్‌టీఎల్‌ను సర్వే, మ్యాపింగ్‌ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. అటవీశాఖ భూముల్లో మొక్కలు నాటే కార్యక్రమా ల నిర్వహణపై తమకు ముందస్తుగా సమాచారం ఇవ్వాలని ఎస్పీ మహేశ్‌ బీ గీతే కోరారు. అటవీ భూముల ఆక్రమణలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ, ఆర్డీవో కేఎస్‌బీ కుమారి, జిల్లా మత్స్యశాఖ అధికారి సౌజన్య, నీటిపారుదల శాఖ అధికారి దయాకర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అఫ్జల్‌బేగం, ఎఫ్‌ఆర్వోలు నాగేశ్వర్‌రావు, శీతల్‌, మున్సిపల్‌ కమిషనర్లు లోకేష్‌, ఖదీర్‌పాషా పాల్గొన్నారు.

బాధితులకు సత్వర న్యాయం చేకూర్చాలి

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం చేకూర్చాలని కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ ఆదేశించారు. జిల్లా స్థాయి విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశంలో మాట్లాడారు. ఇటీవల నియామకమైన నూతన కమిటీ సభ్యులను సన్మానించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో విచారణ వేగంగా పూర్తి చేయాలన్నారు. అట్రాసిటీ కేసుల కింద ఇప్పటి వరకు రూ.1.81 కోట్లు పరిహారంగా అందించామని తెలిపారు. ఎస్పీ మహేశ్‌ బీ గీతే మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో విచారణ వేగంగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. డీఆర్వో జయశ్రీ, ఆర్డీవోలు శ్రీధర్‌బాబు, కేఎస్‌బీ కుమారి, డీఎస్పీ శ్రీనివాసులు, జిల్లా మత్స్యశాఖ అధికారి సౌజన్య, పరిశ్రమలశాఖ జీఎం హనుమంతు, జిల్లా స్థాయి విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యులు బి.నరేశ్‌నాయక్‌, బీపేట రాజు, భూక్య రమేశ్‌, బడుగు లింగయ్య, జోగు రవీందర్‌, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తోట లహరి, వీర రమణయ్య, చింతోజు భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement