ఎల్లారెడ్డిపేట: మండల కేంద్రంలో ఈనెల 18న గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే ఎల్లమ్మ సిద్ధోగానికి రావాలని కోరుతూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్‌లకు ఆహ్వానపత్రికలు అందించారు. హైదరాబాద్‌లోని వారి నివా సాల్లో బుధవారం కలిశారు. కేటీఆర్‌ను శాలు వాతో సత్కరించి, ఎల్లమ్మగడను అందించా రు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాఫ్స్‌కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, ప్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, సర్పంచ్ నర్సింలు, గౌడ సంఘం అధ్యక్షుడు ఎర్ర దేవ య్య, నాయకులు పందిళ్ల లింగంగౌడ్, బాలా గౌడ్, పందిళ్ల పర్శరాములుగౌడ్, తిరుపతి గౌ డ్, దేవయ్యగౌడ్, వెంకట్‌గౌడ్, ప్రదీప్‌గౌడ్, బ లరాంగౌడ్, గంట రమేశ్, రాజాగౌడ్ ఉన్నారు.
17వ పోలీస్ బెటాలియన్‌లో నూతన గెస్ట్‌హౌస్
సిరిసిల్ల అర్బన్: జిల్లాలోని 17వ(ఐఆర్) పోలీస్ బెటాలియన్‌లో నూతనంగా నిర్మించిన గెస్ట్‌హౌస్‌ను తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్ల అదనపు డీజీపీ సంజయ్‌కుమార్ జైన్ బుధవారం వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం బెటాలియన్ ప్రాంగణంలో నూతన ఎస్‌డీఆర్‌ఎఫ్ కార్యాలయం నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. అసిస్టెంట్ కమాండెంట్లు రాందాస్, రాజు, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
టపాసుల వ్యాపారులు నిబంధనలు పాటించాలి
సిరిసిల్ల/సిరిసిల్లటౌన్: దీపావళి పండుగకు టపాసుల షాపులు ఏర్పాటు చేసే వ్యాపారులు నిబంధనలను పాటించాలని సిరిసిల్ల ఆర్డీవో డి.శ్రీధర్‌బాబు కోరారు. సిరిసిల్ల ఆర్డీవో ఆఫీస్‌లో బుధవారం టపాసుల వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఆర్డీవో మాట్లాడుతూ టపాసుల షాపుల మధ్య గ్యాప్ ఉండాలని, అగ్ని ప్రమాదాల నివారణకు ఇసుక, వాటర్ డ్రమ్ములను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. విద్యుత్ వైరింగ్ సరిగ్గా ఉండేలా చూసుకోవాలని, షాపుల చుట్టూరా రోడ్డు ఉండాలని అగ్నిమాపక అధికారుల నిబంధనలు పాటించాలని ఆర్డీవో తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు వ్యాపారులు చట్టపరిధిలో వ్యవహరించాలని, షాపులకు కేటాయించే స్థలాల విషయంలో గొడవలు పడకుండా.. జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సిరిసిల్ల అగ్నిమాపక అధికారి ఎన్.నరేందర్, జీఎస్టీ అధికారి కిరణ్, సెక్షన్ అధికారి లింగం, టపాసుల వ్యాపారులు పాల్గొన్నారు.
జిల్లా ఆస్పత్రి లిఫ్ట్ బాగైంది
సిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో లిఫ్ట్‌ను బాగుచేశారు. ఇటీవల లిఫ్ట్ పాడయి రోగులు రెండో అంతస్తులోకి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారంటూ ‘సాక్షి’లో అక్టోబరు 31న ‘పని చేయని లిఫ్ట్’ అని కథనం ప్రచురితమైంది. స్పందించిన అధికారులు లిఫ్ట్ మెకానిక్‌ను పిలిపించి రిపేరు చేయించారు. రెండు రోజులపాటు రోగులు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు లిఫ్ట్ బాగవడంతో మొదటి, రెండో అంతస్తుకు రోగులు లిఫ్ట్‌లో వెళ్తున్నారు.


