రోడ్డు విస్తరణ పూర్తయ్యేదెప్పుడో? | - | Sakshi
Sakshi News home page

రోడ్డు విస్తరణ పూర్తయ్యేదెప్పుడో?

Oct 24 2026 9:44 AM | Updated on Oct 24 2026 9:44 AM

● 14 నెలలుగా కొనసాగుతున్న పనులు ● 80 ఫీట్ల రోడ్డు పనుల్లో చెప్పలేనంతా జాప్యం ● దుమ్ము, ధూళితో ఇబ్బందులు ● ఇబ్బందుల్లో పట్టణ ప్రజలు

● 14 నెలలుగా కొనసాగుతున్న పనులు ● 80 ఫీట్ల రోడ్డు పనుల్లో చెప్పలేనంతా జాప్యం ● దుమ్ము, ధూళితో ఇబ్బందులు ● ఇబ్బందుల్లో పట్టణ ప్రజలు

వేములవాడ: ఆధ్యాత్మిక పట్టణంలో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు నత్తకే నడక నేర్పినట్లు కొనసాగుతున్నాయి. నిత్యం రోడ్డు పై నుంచి లేస్తున్న దుమ్ముతో ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న వ్యాపార సముదాయాల వారు ఇబ్బందులు పడుతున్నారు. భక్తులు ఎక్కడి నుంచి ఎటూ వెళ్లాలో తెలియక తికమకపడుతున్నారు.

రూ.47కోట్లు..80 ఫీట్లు

రాజన్న గుడి నుంచి మూలవాగు బ్రిడ్జి వరకు రూ.47కోట్లతో 80 ఫీట్ల రోడ్డు విస్తరణ పనులకు 2025 ఆగస్టు 24న శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి పనులు కొనసాగుతూనే ఉన్నాయి. మరో రూ.6.50 కోట్లతో చేపట్టిన మౌలిక వసతుల పనులకు గ్రహణం పట్టింది. పనులు సకాలంలో పూర్తికాకపోవడంతో పట్టణంలో ట్రాఫిక్‌ సమస్యలు పెరిగిపోతున్నాయి.

నష్టాల్లో వ్యాపారులు

రోడ్డు విస్తరణలో భాగంగా చేపట్టిన తవ్వకాలు, కాల్వల నిర్మాణాలు సగంలోనే ఆగిపోవడంతో దుమ్ము, ధూళి నిండిపోతోంది. రాజన్న దర్శనానికి వచ్చే భక్తులు ఈ దుమ్ములో నడవలేక, వాహనాలు నిలపడానికి చోటు లేక అవస్థలు పడుతున్నారు. ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న దుకాణాల్లోకి దుమ్ము చేరడంతో వ్యాపారాలు దెబ్బతింటున్నాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement