పట్టువస్త్రాలు, ఓడిబియ్యంతో పద్మశాలీ పెద్దలు
గజవాహనంపై విహరిస్తున్న శ్రీవారు
సిరిసిల్లటౌన్: సిరిసిల్ల వెంకన్న ఆలయంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆండాళమ్మకు ఓడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. తమ ఇంటి ఆడపడుచుగా భావించే పద్మావతి అమ్మవారు, శ్రీలక్ష్మి వెంకటేశ్వరస్వామిలకు సిరిసిల్ల పద్మశాలీలు పట్టువస్త్రాలు సమర్పించారు. రాత్రి శ్రీవారు శ్రీదేవి, భూదేవి సహితంగా గజవాహనంపై ఊరేగారు. మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ, డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, ఆలయ ఈవో మారుతిరావు, ఏఈవోలు కూనబోయిన సత్యం, పీసరి రవీందర్, పద్మశాలీ సంఘం అధ్యక్షుడు దూడం శంకర్, యూత్ విభాగం అధ్యక్షుడు సబ్బని హరీశ్, మహిళా అధ్యక్షురాలు కాముని వనిత, ప్రముఖులు జిందం చక్రపాణి, గుజ్జె తార, దార్నం లక్ష్మీనారాయణ, అర్చకులు పాల్గొన్నారు.


