అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం | - | Sakshi
Sakshi News home page

అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం

Oct 24 2026 9:44 AM | Updated on Oct 24 2026 9:44 AM

● ఎస్పీ మహేశ్‌ బీ గీతే

సిరిసిల్ల: విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్‌ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని ఎస్పీ మహేశ్‌ బీ గీతే పేర్కొన్నారు. పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం(పోలీస్‌ ఫ్లాగ్‌ డే)లో భాగంగా శుక్రవారం సిరిసిల్ల పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం ఓపెన్‌హౌస్‌ నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులు విద్యతోపాటు సమాజంలో జరుగుతున్న పరిణామాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. పోలీస్‌ శాఖకు సంబంధించిన వివిధ అంశాలపై స్టాళ్లు ఏర్పాటు చేశారు. కేసులో విచారణలో వినియోగిస్తున్న ఆధునిక సాంకేతక పరిజ్ఞానం, ఫేస్‌ రికగ్నిషన్‌ సిస్టమ్‌, పోర్టబుల్‌ ఫింగర్‌ప్రింట్‌ డివైజ్‌ల గురించి వివరించారు. మహిళలు, విద్యార్థినుల రక్షణ కోసం పనిచేస్తున్న షీ టీమ్స్‌, భరోసా కేంద్రాల సేవలపై అవగాహన కల్పించారు. ఆన్‌లైన్‌లో అపరిచితులతో పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, సైబర్‌ నేరానికి గురైతే వెంటనే 1930లో ఫిర్యాదు చేయాలని సూచించారు. డీఎస్పీలు కె.నాగేంద్రచారి, జి.వెంకటేశ్వర్లు, సీఐ శ్రీనివాస్‌, ఎస్సై గణేశ్‌, అనిల్‌, రంజిత్‌, ఆర్‌.ఎస్‌.ఐ సాయికిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement