విద్య, వైద్యానికి పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

విద్య, వైద్యానికి పెద్దపీట

Oct 24 2026 9:44 AM | Updated on Oct 24 2026 9:44 AM

● ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ● మల్లారంలో కంప్యూటర్‌ ల్యాబ్‌ ప్రారంభం

● ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ● మల్లారంలో కంప్యూటర్‌ ల్యాబ్‌ ప్రారంభం

వేములవాడరూరల్‌: విద్య, వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు. వేములవాడరూరల్‌ మండలం మల్లారంలో ఉపసర్పంచ్‌ శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో సేవా సంకల్ప్‌ అభియాన్‌ డిజిటల్‌ ఎడ్యుకేషన్‌, ఏఐ ఎంపవర్‌మెంట్‌ ఇనిషేయేటీవ్‌ కంప్యూటర్‌ ల్యాబ్‌ను శుక్రవారం ప్రారంభించారు. విప్‌ మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు. గ్రామ పాఠశాలకు ఐదు కంప్యూటర్లను అందించిన నెక్స్ట్‌ 360 ఆర్గానిక్‌ ప్రోడక్ట్స్‌ గూగుల్‌ సెర్చ్‌ ప్రాజెక్టు బృందంతోపాటు సర్పంచ్‌ కుమారుడు సంహిత్‌రెడ్డిని శాలువాతో సత్కరించారు. వేములవాడ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రొండి రాజు, పీఏసీఎస్‌ చైర్మన్‌ వకుళాభరణం శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు సోయినేని కరుణాకర్‌, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు సామ తిరుపతిరెడ్డి, ఎంఈవో కిషన్‌, జయవరం సర్పంచ్‌ ఎండ్రాల ప్రసాద్‌, నాయకులు సంగెం వీరారెడ్డి, సంగ స్వామి, షేక్‌ హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement