సిరిసిల్ల/ముస్తాబాద్: తెలంగాణ జూనియర్ బాలికల క్రికెట్ టీమ్‌కు ఎంపికైన మండలంలోని చిప్పలపల్లికి చెందిన గూడెపు వంశికను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం అభినందించారు. వంశికను గ్రామ మాజీ సర్పంచ్ గాడిచర్ల దేవయ్య హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు తీసుకెళ్లి, ఆమె ప్రతిభ గురించి కేటీఆర్‌కు వివరించారు. నామాపూర్ జెడ్పీ హైస్కూల్‌లో పదో తరగతి చదువుతున్న వంశిక నవంబర్‌లో జరిగే పోటీల్లో పాల్గొననుంది. తాను అండగా ఉంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు. గూడూరు మాజీ సర్పంచ్ వెంకటనర్సింగారావు, బీసీ స్టడీసర్కిల్ డైరెక్టర్ జెల్ల వెంకటస్వామి, రాజమల్లయ్య ఉన్నారు.
కుష్ఠును ముందుగా గుర్తిస్తేనే అంగవైకల్య నివారణ
తంగళ్లపల్లి: కుష్ఠును ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందిస్తే అంగవైకల్యాన్ని నివారించవచ్చని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి(డీఎంహెచ్‌వో) ఏంజెలా ఆల్ఫ్రెడ్ పేర్కొన్నారు. తంగళ్లపల్లిలో నిర్వహిస్తున్న లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్(ఎల్‌సీడీసీ) ఇంటింటీ సర్వేను శుక్రవారం తనిఖీ చేశారు. కుష్ఠు వంశపారంపర్యంగా వచ్చేది కాదన్నారు. క్రమం తప్పకుండా మందులు వాడితే ఈ వ్యాధిని సంపూర్ణంగా నయం చేయొచ్చని వివరించారు. జిల్లా డిప్యూటీ మాస్ మీడియా ఆఫీసర్ ప్రసాద్, డీపీఎంవో దేవ్‌సింగ్, హెల్త్ అసిస్టెంట్లు మహేశ్, సతీశ్, ఏఎన్‌ఎం ప్రమీల, ఆశా కార్యకర్త హఫీజ పాల్గొన్నారు.
వినియోగదారులపై భారం మోపితే చర్యలు
తంగళ్లపల్లి: ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతే వాటి మార్పిడికి వినియోగదారుల నుంచి డబ్బులు వసూలు చేయొద్దని విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక(సీజీఆర్‌ఎఫ్–2, టీజీఎన్పీడీసీఎల్) చైర్‌పర్సన్ కె.కిషన్ స్పష్టం చేశారు. వినియోగదారులతో ట్రాన్స్‌ఫార్మర్ల రీప్లేస్‌మెంట్ చేయిస్తే బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తంగళ్లపల్లిలో శుక్రవారం నిర్వహించిన విద్యుత్ వినియోగదారుల సమస్యల పరి ష్కార వేదిక అవగాహన సదస్సులో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో ట్రాన్స్‌ఫార్మర్ల సమస్యలు ఉన్నతాధికారులైన ఎస్‌ఈ, డైరెక్టర్(ఆపరేషన్స్) దృష్టికి తీసుకెళ్తే, నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటారన్నారు. అత్యవసర విద్యుత్ సమస్యలకు 1912కు కాల్ చేయాలని కోరారు. ఫోరం సభ్యులు జె.ఆర్.చౌహాన్(టెక్నికల్), పి.శ్రీని వాస్(ఫైనాన్స్), 4వ సభ్యుడు కె.శ్రీనివా స్‌రెడ్డి, డీఈ అంజయ్య, ఏడీఈ గోపినాథ్, ఏఈ మధుకర్, సర్పంచులు పూర్మాని రాజశేఖర్‌రెడ్డి, గాదగోని సాగర్, సాయికృష్ణ, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
జిల్లా మహిళా కబడ్డీ టీం ఎంపిక
వేములవాడ: ఈనెల 28 నుంచి 30 వరకు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జరిగే 73వ రాష్ట్ర స్థాయి మహిళా కబడ్డీ పోటీలకు జిల్లా జట్టును ఎంపిక చేసినట్లు జిల్లా కబట్టి అసోసియేషన్ అధ్యక్షుడు ముస్కు మల్లారెడ్డి, కార్యదర్శి తిరుపతి తెలిపారు. వేములవాడ ప్రభుత్వ జూని యర్ కాలేజీ గ్రౌండ్‌లో శుక్రవారం ఎంపిక పో టీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. 14 మంది క్రీడాకారులతోపాటు ఒక కోచ్, ఒక మేనేజర్‌లను ఎంపిక చేసినట్లు వివరించారు. వీరు ఈనెల 27న సత్తుపల్లికి వెళ్తారని తెలిపారు. వీరందరికి కబడ్డీ అసోసియేషన్ చైర్మన్, ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా డ్రెస్సులు పంపిణీ చేస్తామని తెలిపారు.


